Former Telangana Governor Tamilisai Election Campaign For BJP: తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆయాపార్టీలు పదునైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ తమకు మరోసారి అధికారం ఇవ్వాలని ప్రచారం నిర్వహిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి తమకు ఓక చాన్స్ ఇచ్చి చూడాలని ఇండియా కూటమి నేతలు అభ్యర్థిస్తున్నాకు. ఇక బీఆర్ఎస్.. తమని ఉద్యమ పార్టీ అని, మనం లోకల్, కాంగ్రెస్ లు, బీజేపీలు ఒకటే నంటూ, మనల్ని మనమే పాలించుకోవాలంటూ కూడా వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నాయకులు, వరుసగా ప్రచారానికి వస్తున్నారు. ఇటీవల హోమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా.. తెలంగాణలో పర్యటించారు. అదే విధంగా సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ల ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజీపీ కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. అదే విధంగా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్ లు వరుసగా తెలంగాణకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ కు కేంద్రం బీజేపీ అధినాయకత్వం మరో కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళిసైను.. సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జిగా నియమించారు. నేటి నుండి ఎన్నికల వరకు హైదరాబాద్‌లోనే ఉంటూ.. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన తమిళిసై.. తనదైన స్టైల్ హైదరాబాద్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తమిళి సై మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి కేంద్ర మంత్రులలో అధిక భాగం తెలంగాణ నుంచి ఉంటారని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల మరోసారి తెలంగాణ ప్రజలతో మమేకం అయ్యే అవకాశం వచ్చిందన్నారు. వీలైనన్ని ఎక్కువ బీజేపీ లోక్ సభ స్థానాలను కవర్ చేయడమే తన టార్గెట్ అని అన్నారు. ఇక తమిళనాడులో హోరాహోరీగా సాగిన చెన్నై సౌత్ ఎన్నికలలో ఈసారి తప్పకుండా విజయం సాధిస్తానని తమిళి సై ధీమా వ్యక్తంచేశారు. ఇక కాంగ్రెస్ ఎలాగైన ఓడిపోతామని తెలిసి, బీజేపీపై రిజర్వేషన్ల విషయంలో విషపు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధంచి వేలాది మందిని జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని తమిళిసై ఎద్దేవా చేశారు.
Read More: Kerala Court Verdict: కేరళ కోర్టు సంచలన తీర్పు.. అత్యాచార నిందితుడికి 106 ఏళ్ల జైలు శిక్ష..
రిజర్వేషన్లను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ఎత్తేయదని, దీనిపై ప్రజలు ఎలాంటి గందర గోళానికి గురికావాల్సిన అవసరంలేదనిన తమిళి సై అన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని ఆమె కోరారు. కాగా, తమిళి సై తెలంగాణకు రావడం, ఇప్పటికే సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తారు. మరోవైపు తమిళిసై రాక అనేది హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కూడా మరింత లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter