Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..

Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు. తొందరలనే లక్షల మంది దళితులతో వచ్చి సెక్రెటెరియేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం  దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 13, 2024, 08:36 PM IST
  • దళిత బంధుపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం..
  • చేవెళ్లలో జెండా ఎగురుతుందన్న సబితా..
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..

Former CM KCR Fires On CM KCR In Chevella Public Meeting: తెలంగాణ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్  ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బహింరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హజరయ్యారు. బీఆర్ఎస్ కీలక నేతలంతా బహిరంగ సభలకు హజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితులకు న్యాయం చేయాలని, దళిత వాడలను ధనిక వాడలుగా చేయాలని సంకల్పించి దళితులకు  పదిలక్షల రూపాయలు ఇచ్చే దళిత బంధు పథకం తీసుకొచ్చామన్నారు. ఇప్పటిదాక.. 1 లక్ష 30 వేల మందికి దళిత బంధు ఇచ్చేలా ప్రొసిడింగ్స్ కలెక్టర్ లకు పంపామని అన్నారు.

Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..

కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే.. పన్నేండు లక్షలు ఇస్తామని చెప్పిందన్నారు. వెంటనే దళితులకు అన్నట్లుగా.. పన్నేండు లక్షల దళిత బంధు ఇవ్వకుంటే.. లక్షల మందితో కలిసి వచ్చి సెక్రెటెరియేట్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చి హామీలన్ని నెరవేర్చేవరకు వెంటాడతామన్నారు.  అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కేసీఆర్ అభ్యర్థించారు. ఇక్కడి కాంగ్రెస్ నేత.. మోహర్ రెడ్డి బీసీలకు దమ్ము, ధైర్యం ఉంటే కాసానిని గెలిపించుకొవాలని సవాల్ విసిరారు. అందుకే ఇక్కడి ప్రజలు,విద్యావంతులు, మేధావులు ఒకతాటిపైకి వచ్చే ఇలాంటి అహాంకార వాదులకు బుధ్ది చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

చేవెళ్లలో బీఆర్ఎస్ జెండా గెలుస్తుందన్న సబితా ఇంద్రారెడ్డి..

చేవెళ్ల సభలో  మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ చేవెళ్లలో గెలవబోతుందన్నారు. కేసీఆర్ రాకముందు ఎర్రటి ఎండ ఉండేదని, ఇప్పుడు మాత్రం.. నల్లగి మేఘాలు వచ్చివర్షం పడుతుందని, ఇదే గెలుపుకు సూచన అని సబితా అన్నారు.

ఉమ్మడి రంగారెడ్డికి పట్టిన దరిద్రం పోయింది..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పట్టిన దరిద్రం పోయిందని బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్  రెడ్డి అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పార్టీ నుంచి వెళ్లిపోవడం మంచిదే అన్నారు. పట్నంకుటుంబం.. తాండూరు నుంచి చేవెళ్ల, చేవెళ్ల నుంచి మల్కాజ్ గిరి ఆతర్వాత.. మల్కాజ్ గిరి నుంచి ఇంటికి వెళ్లిపోతుందని జోస్యం చెప్పారు.

Read More: Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..

కొందరు బీఆర్ఎస్ ఖతమైపోయిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, పోయే వారు పోయిన కూడా కొత్త నాయకులను సిద్ధం చేసుకునే సత్తా బీఆర్ఎస్ కు ఉందని పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పార్టీని వీడి వెళ్లిన వారి వల్ల బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమి లేదని పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News