KCR Birth Day: ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

KCR Birth Day Celebrations: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ ఈనెల 17వ తేదీతో 70 సంవత్సరాల పడిలోకి పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వారికి ఆదుకునే ఓ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 15, 2024, 09:12 PM IST
KCR Birth Day: ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

BRS Party Insurance To Auto Drivers: ఎన్నికల్లో ఓటమి అనంతరం.. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను చేసుకోనున్నారు. ఈనెల 17వ తేదీన కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆ రోజు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్‌ జన్మదిన కార్యక్రమాల షెడ్యూల్‌ను మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.

Also Read: Telangana: చేతకాదని రేవంత్‌ వైదొలిగితే ముఖ్యమంత్రిగా నేనేంటో చూపిస్తా: హరీశ్ రావు సవాల్‌

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడారు. 'బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 70వ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్‌లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్‌ నాయకులు హాజరవుతారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం' అని తెలిపారు.

Also Read: Assembly: అసెంబ్లీలో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రోడ్డుపై ధర్నా

కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష కవరేజీ వచ్చేలా ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. వెయ్యి మందికి కలిపి మొత్తం రూ.10 కోట్ల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాల పంపిణీ చేస్తామని వివరించారు. ఇక దివ్యాంగులకు వీల్‌చైర్స్‌, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక డాక్యుమెంటరీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి సారథిగా ఉండి పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంతో కూడిన 30 నిమిషాల 'తానే ఒక చరిత్ర' పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ 70వ పడిలోకి అడుగు పెడుతున్న సందర్బంగా మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News