Madhapur Police Station: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం పూట ఉన్నఫళంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ప్రాణభయంతో పోలీసులు బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొద్దిసేపటికి అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. నిమిషాల అనంతరం మంటలు అదుపులోకి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మాదాపూర్ ప్రధాని రహదారిపైనే పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ప్రమాదం ద్వారా నిత్యం రద్దీగా ఉండే మాదాపూర్, హైటెక్ సిటీ మార్గం ట్రాఫిక్‌తో నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విధులు ముగించుకుని వెళ్లే ఉద్యోగులు నరకం అనుభవించారు. వెంటనే మంటలను నియంత్రించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా పోలీస్ స్టేషన్ వెనుకాల సీజ్ చేసిన సిలిండర్లు నిల్వ ఉంచారు. అవి అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తే అయోధ్య రామాలయ సంబరాలు కారణంగా తెలుస్తోంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం సాయంత్రం మాదాపూర్ ప్రాంతంలో సంబరాలు జరిగాయి. సాయంత్రం దీపాలు వెలిగించాలని, దీపావళి చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు బాణాసంచా కాల్చినట్లు తెలిసిందే. పోలీస్‌స్టేషన్ సమీపంలో కాల్చిన ఆ బాణాసంచా నుంచి నిప్పురవ్వలు ఎగిరి పోలీస్‌స్టేషన్‌లోకి చేరాయని భావిస్తున్నారు. ఆ నిప్పు రవ్వలు సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లపై పడి ప్రమాదం సంభవించినట్టు చర్చ జరుగుతోంది. నిప్పురవ్వలు పడడంతో సిలిండర్లు పేలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
Fire Engulfs Police Station in Hyd.
In a harrowing incident on Monday evening, a fierce fire erupted at the Madhapur police station in Hyd. SFO, Fazal, attributes the fire's ignition to a suspected firecracker landing on the seized cylinders, causing a series of explosions. pic.twitter.com/id0JMPHhdY— Syed iftikhar Ali (@Syedift84721583) January 22, 2024
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి