Farmer Climbs Cell Tower: తన భూమి ఇప్పించాలంటూ సెల్ టవర్ ఎక్కిన రైతు

Farmer Climbs Cell Tower To Protest | మార్పులు చేర్పులు జరిగినా రైతులు మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పండించిన పంట పండలేదని కొందరు, పండిన పంట చేతికొచ్చేలోపే కోల్పోయామని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం.

Last Updated : Oct 27, 2020, 04:51 PM IST
Farmer Climbs Cell Tower: తన భూమి ఇప్పించాలంటూ సెల్ టవర్ ఎక్కిన రైతు

ఎన్ని చట్టాలు వచ్చినా, మార్పులు చేర్పులు జరిగినా రైతులు మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పండించిన పంట పండలేదని కొందరు రైతులు (Farmers), పండిన పంట చేతికొచ్చేలోపే కోల్పోయామని కొందరు రైతులు ఆత్మహత్య (Farmers Suicide) చేసుకోవడం చూస్తుంటాం. కొన్ని సందర్బాలలో తమ పొలాన్ని వేరే వ్యక్తులు పట్టా చేయించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి  యత్నిస్తుంటారు.

 

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని జమలాపురంలో ఇలాంటి ఘటన జరిగింది. స్థానికంగా సర్వేనెంబర్ 9లో 8 ఎకరాలు 22కుంటలు భూమి ఉండగా, అది ఆక్రమణకు గురైందని రైతు బెల్లంకొండ శివ కోటేశ్వరరావు నిరసన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. తమ భూమిని ఆక్రమంచి తమకు అన్యాయం చేశారని ఆరోపించాడు.

 

ఈ విషయంపై రెవెన్యూ అధికారులు సహకరించి న్యాయం చేయడం లేదన్నాడు. తన భూమిని కబ్జా చేసిన వ్యక్తులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై, భౌతిక దాడులు చేశారని ఆందోళనకు దిగాడు. తన భూమి తనకు ఇప్పించాలని, ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. న్యాయం జరిగేలా చూస్తామని చివరగా ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్  హామీ ఇవ్వడంతో రైతు సెల్ టవర్ దిగి వచ్చాడు. అతడిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News