/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Madhusudhana Chary as MLC under governor quota : మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా... గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై సస్పెన్స్ తొలగినట్లయింది. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. ఇటీవల కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడంతో ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం ఇచ్చారు.

నిజానికి దేశపతి శ్రీనివాస్ పేరు కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor quota MLC) జాబితాలో వినిపించినప్పటికీ.. సీఎం కేసీఆర్ మధుసూదనచారి వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మధుసూదానాచారి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి (Bhupalapally) నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన స్పీకర్‌గా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి మధుసూదనాచారికి ఏ పదవి దక్కలేదు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు.

Also Read: ప్రధాని మోదీకి రైతుల షాక్... సాగు చట్టాల ఉపసంహరణపై వారి రియాక్షన్ ఇదే...

గతంలో స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మధుసూదనాచారిని (Madhusudhana Chary) ఈసారి శాసనమండలి ఛైర్మన్‌ను చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసే సమయానికి మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. మరోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారనే ప్రచారం నేపథ్యంలో మండలి సారథ్యం మధుసూదనాచారికే దక్కవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి పేరు కూడా మండలి ఛైర్మన్ రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే రాజ్యసభకు రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్న బండా ప్రకాశ్‌ను మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బండా ప్రకాశ్‌ను (Banda Prakash) ఈటల స్థానంలో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా లేకపోలేదు. అంతిమ నిర్ణయం సీఎం కేసీఆర్‌దే కాబట్టి.. ఆయన ఏం డిసైడ్ చేయనున్నారనే చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
ex speaker Madhusudhana Chary appointed as mlc under governor quota
News Source: 
Home Title: 

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి... ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి... ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం...
Caption: 
Image source : Facebook
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి
మూడేళ్లుగా ఏ పదవిలో లేని మధుసూదనాచారి
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే 

Mobile Title: 
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి... ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం...
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, November 19, 2021 - 11:47
Request Count: 
83
Is Breaking News: 
No