Ex Mp Meets Bandi Sanjay : నడ్డా పర్యటనకు ముందు బండి సంజయ్ తో మాజీ ఎంపీ, కీలకనేత భేటి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ తో భేటి కావడం రాజకీయవర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 02:18 PM IST
  • బండి సంజయ్ తో మాజీ ఎంపీ, కీలకనేత భేటి
  • బీజేపీలో చేరతారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్
  • కేసీఆర్ ను ఓడించాలని బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు
Ex Mp Meets Bandi Sanjay : నడ్డా పర్యటనకు ముందు బండి సంజయ్ తో మాజీ ఎంపీ, కీలకనేత భేటి

Ex Mp Meets Bandi Sanjay :రాజకీయా  నాయకులు ఎప్పుడు ఏపార్టీలో ఉంటారో చెప్పడం చాలా కష్టం.   అప్పటి పరిస్థితులు, రాజకీయ  అవసరాలను బట్టి పొలిటికల్ లీడర్స్ కండువాలు మారుస్తుంటారు. తెలంగాణ వచ్చిన తరువాత పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా మారాయి. అయితే ప్రస్తుతం  తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్న బీజేపీ బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే టిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఈటెల, మాజీ ఎంపీ వివేక్,డీకే అరుణ లాంటి  చాలా మంది నేతలు బీజేపీలో  జాయిన్ అయ్యారు. చాలా మంది టిఆర్ఎస్ ఇతర పార్టీల నేతలు బీజేపీలో  చేరడానికి సిద్ధం అవుతున్నారు. కానీ ఒక్క నేత మాత్రం బీజేపీతో సత్సంబంధాలు  మెయింటైన్ చేస్తున్నప్పటికీ బీజేపీలో మాత్రం చేరడం లేదు. చాలా సార్లు బీజేపీలో జాయిన్ అవుతాడు అనుకున్నప్పటికి తటస్థంగా ఉంటూ తెలంగాణ రాజకీయాలలో సెంటర్ పాయింట్ గా మారాడు మాజీ ఎంపీ కొండవిశ్వేశ్వరరెడ్డి. 2014లో చేవెళ్ల నుండి టిఆర్ఎస్ ఎంపీగా గెలిచిన విశ్వేశ్వరరెడ్డి తరువాత కేసీఆర్ నాయకత్వం మీద అసంతృప్తితో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేతగా వ్యవహరించాడు. అయితే కాంగ్రెస్ లో కూడా అసంతృప్తితో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత కొండా  విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెసులో కీలకంగా మారుతారని అంతా భావించారు.కానీ రేవంత్ రెడ్డి కొండా ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో తిరిగి  అక్టీవ్ కావాలని  కోరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు.

 అయితే కేసీఆర్ ఓడించాలని  పట్టుదలగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నేతలతో  ఈమధ్య కొంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. కానీ బీజేపీలో మాత్రం చేరుతాడా లేడా అన్నది కన్ఫర్మ్ చేయడం లేదు. ఈటెలను టిఆర్ఎస్ పార్టీలో నుండి పంపించినప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఈటెలకు పూర్తి మద్దతు తెలిపారు. అలాగే హుజురాబాద్ ఎన్నికల్లో  ఈటెలను గెలిపించాలని  హుజురాబాద్ ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అప్పుడే బీజేపీలో చేరుతారని అనుకున్న కొండా మాత్రం సస్పెన్స్ అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. తాజగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కొండ విశ్వేశ్వరరెడ్డి భేటీకావడంతో బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తుండడంతో బండి సంజయ్ తో కొండ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. బండితో భేటి అయ్యే ముందు మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్  రెడ్డితో కొండ విశ్వేశ్వరరెడ్డి భేటి అయ్యారు. దీనితో విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చగా సాగుతుంది. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారా లేక ప్రజా సంగ్రామ  యాత్ర ముగింపు సందర్భంగా అమిత్  షా వస్తుండడంతో ఆయన సమక్షంలో బీజేపీలో చేరతారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 

అసలు కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరతారా లేదా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఏదేమైనా కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నేత రాజకీయాలలో తటస్థంగా ఉండకుండా బీజేపీలో చేరాలని చాలా మంది సన్నిహితులు కోరుతున్నారు.రాజకీయలలో అజాత శత్రువుగా పేరొందిన కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు   బీజేపీలో చేరితే  పార్టీ బలపడుతుందని బీజేపీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి కొండా జాయింగ్ బుస్టాప్ అవుతుందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

 

Also Read :TRS White Challenge: తెరపైకి మళ్లీ 'వైట్ ఛాలెంజ్' వార్... రాహుల్‌కు సవాల్ విసురుతూ ఫ్లెక్సీలు..

Also Read :Political Heat In Telangana: తెలంగాణలో జాతీయ నేతల టూర్లు..మొదలైన ఎన్నికల జాతర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News