/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

KTR Warning to CM Revanth Reddy: పదేళ్లపాటు విధ్వంసమైన తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడనంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదన్నారు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని చెప్పారు. పరిపాలనపైన పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించామన్నారు. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకుపోతామన్నారు. ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నామని చెప్పారు. ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ అని.. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారని అన్నారు. 

ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. 2014, 2019 లలో వరంగల్ ఎంపీ సీటును BRS గెలిచిందని,. ఈ సారి కూడా వరంగల్‌లో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దామన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని.. ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు.. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నామని.. కానీ గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో BRS ను, గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు తమ మీద ఆకారణంగా నిందలు వేస్తే ఊరుకోమన్నారు. కేసీఆర్ కరెంట్ పరిస్థితి బాగు చేశారని చిన్న పిల్ల వాడిని అడిగినా చెబుతారని.. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామన్నారు. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని.. అసలు సినిమా ముందుందని అన్నారు.

"తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపై తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని భట్టి అసెంబ్లీ వేదిగ్గా అబద్దమాడారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ల 420 హామీలతోనే ఎండగట్టాలి. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కస్సుతో రద్దు చేస్తుంది. వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నది, పేద గొంతుకలకు మనం అండగా ఉండాలి. సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయి. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి." అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Section: 
English Title: 
Ex Minister KTR Warning to CM Revanth Reddy on Districts Redistribution in Telangana kr
News Source: 
Home Title: 

Ex Minister KTR: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం.. కేటీఆర్ మాస్ వార్నింగ్

Ex Minister KTR: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం.. కేటీఆర్ మాస్ వార్నింగ్
Caption: 
KTR Warning to CM Revanth Reddy
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Ex Minister KTR: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం.. కేటీఆర్ మాస్ వార్నింగ్
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Wednesday, January 10, 2024 - 16:49
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
51
Is Breaking News: 
No
Word Count: 
348