KT Rama Rao Bhaskar Award: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుతో తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యవహారం తీవ్ర రాజకీయ వివాదం రేపింది. బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ పీఏసీ చైర్మన్ పదవి కోసం తాను పార్టీ మారలేదని చెప్పడంతో వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజులు తీవ్ర రచ్చ జరగ్గా.. ఈ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 'ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య కొట్లాట అయితే దాన్ని కాంగ్రెస్‌కు రుద్దడం ఏమిటి' అని ప్రశ్నించారు. అతడి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిగా వ్యంగం జోడించి ఘాటుగా స్పందించారు. శ్రీధర్ బాబుకు భాస్కర అవార్డు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన అతి తెలివి మంత్రి అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Also Read: Revath Asad Friendship: అసదుద్దీన్‌కు రేవంత్ స్నేహహస్తం.. హస్తం-గాలిపటం మళ్లీ దోస్తీ?
'అతి తెలివి మంత్రి గారు (శ్రీధర్ బాబు) మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు (రేవంత్ రెడ్డి) కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్‌లో ఉన్నాడా?' అని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. 'సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం; మరి మా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు?' తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. 'సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు?' అని నిలదీశారు.
Also Read: September 17th: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17వ తేదీకి మరో కొత్త పేరు
'అసలు చేర్చుకోవడం ఎందుకు? ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 'మీరు మీ అతితెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు' అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును భాస్కర అవార్డుకు నామినేట్ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. 'ఉత్తమ సహాయ నటుడి కోటాలో భాస్కర అవార్డుకు మంత్రి శ్రీధర్ బాబను నామినేట్ చేస్తున్నా. ఆయన అవార్డు పొందినందుకు శుభాకాంక్షలు' అని 'ఎక్స్'లో కేటీఆర్ ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.