Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

K Kavitha ED, IT Raids: లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత నివాసంపై ఈసారి ఈడీతోపాటు ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 15, 2024, 04:40 PM IST
Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

K Kavitha: మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ కేసులో నిందితురాలిగా ఆమె పేరును చేర్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా ఆదాయపు పన్ను శాఖను వెంటబెట్టుకొచ్చింది. ఈడీ, ఐటీ శాఖ అధికారులు ఉమ్మడిగా మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత ఇంటిపై దాడులు చేశారు. ఆమె నివాసంలో సోదాలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది.

Also Read: MP Candidates: అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం.. మరో రెండు లోక్‌సభ స్థానాలకు కొత్త వ్యక్తులు

 

హైదరాబాద్‌లోని కవిత నివాసానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల సందర్భంగా కవితతోపాటు ఆమె భర్తకు సంబంధించిన వ్యాపారాలపై వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయమై ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. 

Also Read: Yadadri EO: భట్టి విక్రమార్క వివాదంలో భారీ ట్విస్ట్‌.. యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

 

మద్యం కుంభకోణం కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనెల 19వ తేదీకి కేసు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు రావాలని నోటీసులు పంపగా ఇటీవల కవిత తాను హాజరుకాలేని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి కవిత ఇంట్లో తనిఖీలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అటు రాజకీయంగా.. ఇటు కుటుంబపరంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో మారిన పరిణామాల కారణంగా బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రభుత్వ సంస్థలు కక్ష కట్టినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కవితను అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలాంటి సోదాలు చేయడం సాధారణమని బీఆర్‌ఎస్‌ పార్టీ కొట్టిపారేసింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను బయటపెట్టేందుకు ఇలాంటి తనిఖీలతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు రావుల శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. ఏది ఏమైనా నిజం గెలుస్తుందని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News