Drug seizure : హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Rs 5.50 crore Drug seizure in Hyderabad : హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ పరిధిలో దాదాపు 14.2 కిలోల (14.2 kg) నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ను బేగంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. వాటి విలువ దాదాపు రూ.5.50 కోట్లు  ఉంటుందని అంచనా ఉందన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 06:35 PM IST
  • హైదరాబాద్‌ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
  • దాదాపు 14.2 కిలోల నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ స్వాధీనం
  • దాదాపు రూ.5.50 కోట్ల విలువ
  • ఇండియన్‌ మార్కెట్‌లో దీని విలువ కిలోకి రూ. 40 లక్షలు
  • వివరాలు తెలిసిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌
Drug seizure : హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Drug seizure Hyderabad cops DRI seize Pseudoephedrine worth Rs.5.5 crore: హైదరాబాద్‌ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ (Hyderabad CP Anjanikumar) తెలిపారు.

హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ పరిధిలో దాదాపు 14.2 కిలోల (14.2 kg) నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ను (Pseudoephedrine) బేగంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. వాటి విలువ దాదాపు రూ.5.50 కోట్లు (worth Rs.5.5 crore) ఉంటుందని అంచనా ఉందన్నారు. ఇండియన్‌ మార్కెట్‌లో దీని విలువ కిలోకి రూ. 40 లక్షలు (40 lakhs) ఉంటుందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చెప్పారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) (Directorate of Revenue Intelligence) సమాచారం మేరకు బేగంపేటలోని ఇంటర్‌నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీలో (Courier‌ Agency) తనిఖీలు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి ప్యాకింగ్‌ చేసి ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారని సీపీ వెల్లడించారు. కొరియర్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్న 22 ఫొటో ఫ్రేమ్స్‌ను (22 Photo Frames‌) గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అంజనీకుమార్‌ చెప్పారు.

Also Read : Viral Video: రంగు రంగు చేపల మధ్య కూర్చొని భోంచేస్తే..?? పదండి అదెక్కడో చూద్దాం!

తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు దీంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నామని సీపీ తెలిపారు. ఇక హైదరాబాద్‌లో మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 110 ఎండీఎంఏ టాబ్లెట్స్‌ను (110 MDMA Tablets‌) స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.40 కోట్లు (Rs 1.40 crore) విలువైన 566 కిలోల పొడి గంజాయిని (Ganja) స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Also Read : Williams‌ case : నిత్య పెళ్లికొడుకు విలియమ్స్‌ కేసులో మరో ట్విస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News