Dr Chennamaneni Vikas Joins BJP: బీజేపీలో చేరిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దంపతులు

Dr Chennamaneni Vikas and his wife Deepa joins BJP: ట్రస్టు ద్వారా వేములవాడలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది అని జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

Written by - Pavan | Last Updated : Aug 31, 2023, 05:07 AM IST
Dr Chennamaneni Vikas Joins BJP: బీజేపీలో చేరిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దంపతులు

Dr Chennamaneni Vikas and his wife Deepa joins BJP: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.  కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలే నిదర్శనమన్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాదిమంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  డాక్టర్ చెన్నమనేని వికాస్, చెన్నమనేని దీప దంపతులు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా బండి  సంజయ్ మాట్లాడుతూ, ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం కష్టపడి పార్టీ కోసం పనిచేసే కుటుంబం నేపథ్యం, జాతీయ భావం ఉన్న కుటుంబం... నిరంతరం పార్టీని ప్రోత్సహిస్తూ కార్యకర్తలను ఆదుకునే కుటుంబం నేపథ్యం నుండి డా వికాస్ వచ్చి పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం అని బండి సంజయ్ హర్షం వ్యక్తంచేశారు.  

రాజన్న సిరిసిల్లలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయం. దీంతోపాటు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యం. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలనపట్ల పూర్తిగా విసిగిపోయారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఏఎన్ఎంలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరుద్యోగులు, ఏఎన్ఎంలు నిరసన చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎంతటి విచక్షణారహితంగా వ్యవహరించింది గుర్తుచేసుకోవాలన్నారు. ఖమ్మంలో బీజేపీ ఎక్కడుందని అడిగిన వాళ్లకు సభ సక్సెస్ చేయడంతో బీజేపీ సత్తా ఏందో నిరూపించాం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలను నమ్మించి రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అని బండి సంజయ్ మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించే పార్టీ బీజేపీ మాత్రమే. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీ. పేదలను ఆదుకునే పార్టీ బీజేపీనేనని అన్నారు. గ్యాస్ ధర పెంపు భారాన్ని ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దార్లకు రూ.400 తగ్గించడంతోపాటు అందరికీ 200 రూపాయలు తగ్గించడం హర్షణీయం. గ్యాస్ పై వాగిన నోర్లు మూతపడేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. 
హిందూ బంధువులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నీకు నేను రక్ష. మనకు హిందూ ధర్మ రక్ష అంటూ జరుపుకునే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నా అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

Trending News