Telangana Congress: టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడినందుకు ఆయనపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ పరిశీలించి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ సంఘం ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసిన మదన్ మోహన్ తన నియోజకవర్గ పరిధిలో చేసే కార్యక్రమాలు పార్టీ పేరుతో కాకుండా (MYF) మదన్ యూత్ ఫోర్స్ పేరుతో చేస్తున్నారని దీనిపై కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్ మోహన్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఇక నుంచి ఏ కార్యక్రమాలు చేసిన అవి పార్టీ పరిధిలోనే చేయాలని పార్టీలోని నాయకులను అందరని ఆహ్వానించాలని తెలుపుతూ లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల ఎల్లారెడ్డిలో పార్టీ నాయకులకు సమాచారం లేకుండా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని ఇలాంటివి కూడా భవిష్యత్‌లో మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండాలని చెప్పారు.
కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు వీడియో సమాచారం ఇచ్చారని కానీ అలా సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షులకు లేదని ఆ సస్పెన్షన్ చెల్లదని తెలుపుతూ ఆయనకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే అవి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం దృష్టికి తేవాలని, నేరుగా సస్పెండ్ చేసే అధికారం లేదని లేఖలో తెలపాలని నిర్ణయించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డికి లేఖ రాసి వారిని పిలిపించి సమస్యను పరిష్కరించాలని క్రమశిక్షణ సంఘం సూచించింది.
జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రఘువరెడ్డి తన డీసీసీ పరిధి దాటి పోయి వరంగల్ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జంగా రాఘవ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది క్రమశిక్షణ సంఘం కమిటీ. జనగామ డీసీసీ పరిధిలో అలాగే తాను పోటీ చేసిన పాలకుర్తి అసెంబ్లీ పరిధిలో రాజకీయ కార్యక్రమాలు చేసుకోవాలని సూచిస్తూ లేఖ రాయాలని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. నేతలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలను దాటితే కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
Also Read: Amazing Benefits With Lotus Flower:తామర పువ్వుతో ప్రయోజనాలు అమోగం..తెలిస్తే వావ్ అంటారు
Also Read: Omega 3 Fatty Acids: ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా లభించే శాకాహార పదార్ధాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Telangana Congress: టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం.. అద్దంకి దయాకర్‌కి షోకాజ్ నోటీసులు!
గాంధీభవన్‌లో చిన్నారెడ్డి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం
పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం
పలువురి నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్న టీపీసీసీ క్రమశిక్షణ సంఘం