Medaram Jathara 2024: భక్తులకు అలర్ట్‌.. మేడారం జాతరకు వెళ్తుంటే ఇవి మీ వెంట కచ్చితంగా ఉండాల్సిందే..!

Medaram Jathara: శక్తి స్వరూపిణిలు, అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ముఖ్య గమనిక. జాతరకు వెళ్తుంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు, పత్రాలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే జాతరలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు. దీంతో జాతరకు వెళ్లే భక్తులు ఏం తీసుకోవాలో తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 4, 2024, 04:18 PM IST
Medaram Jathara 2024: భక్తులకు అలర్ట్‌.. మేడారం జాతరకు వెళ్తుంటే ఇవి మీ వెంట కచ్చితంగా ఉండాల్సిందే..!

How To Go Medaram: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన భారత దక్షిణ మహా కుంభమేళాకు మేడారం సిద్ధమవుతోంది. జాతర ఘడియలు సమీపిస్తుండడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటుండడంతో మేడారం ప్రాంతం కిటకిటలాడుతోంది. ఈనెల 21వ తేదీ నుంచి 28 వరకు జాతర జరగనుండగా ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట జరిగిన జాతరకు కరోనా భయం ఉండగా ఈసారి అలాంటి భయం ఏమీ లేకపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే జాతర జరిగే ప్రదేశం అటవీ ప్రాంతం కావడంతో అటవీ అధికారులు భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇక జాతరలో సమర్పించే నిలువెత్తు బంగారం విషయమై కూడా ఎక్సైజ్‌ శాఖ కీలక ప్రకటన చేసింది. దీంతోపాటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం సదుపాకం కల్పించడంతో ఆర్టీసీ కూడా కీలక సూచనలు చేస్తున్నాయి.

Also Read: Most Wanted Escape Prison: జైలు నుంచి మాఫియా కింగ్‌ పరార్‌.. ఎలా అనేది వింటే మీరు పరేషాన్‌ అవుతారు

బంగారం సమర్పించాలంటే ఆధార్‌ చూయించాల్సిందే..
మేడారం జాతరలో కీలకమైనది 'బంగారం'. అడవి తల్లులను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. బంగారం అంటే బెల్లమే. అటవీ ప్రాంతం కావడంతో బెల్లం విక్రయాలపై నిషేధం ఉంది. జాతరకు వచ్చే బెల్లం సారా వ్యాపారులు కొనుగోలు చేసే ప్రమాదం ఉంది. బెల్లం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్న ఎక్సైజ్‌ శాఖ జాతర నేపథ్యంలో వాటిని సడలించింది. బంగారం సమర్పించాలనుకుంటున్న భక్తులు విధిగా ఆధార్‌ కార్డు చూపించాలి. బెల్లం క్రయవిక్రయాలకు ఎక్సైజ్‌ శాఖ ఆధార్‌ తప్పనిసరి చేసింది. మేడారం వచ్చే భక్తులు తమ వెంట ఆధార్‌ తప్పనిసరిగా తీసుకురావాలని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Also Read: Millets Adai Recipe: దోశ తిని తిని బోర్ కొడుతుందా..కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకునే "అడై" మీ కోసం..

ప్లాస్టిక్‌ పూర్తి నిషేధం
అమ్మవార్లు కొలువైన ప్రదేశం అటవీ ప్రాంతం. జాతర సమయంలో చిట్టడవి కాస్త మహా జాతరగా మారుతుంది. కోట్లాది మంది భక్తులు వస్తుండడంతో అటవీ ప్రాంతం కాలుష్యమవుతుందని అటవీ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వన ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే జాతరకు వచ్చే భక్తులు మాత్రం ప్లాస్టిక్‌ వస్తువులు వాడొద్దని అటవీ శాఖ సూచిస్తోంది. జాతరకు వస్తున్న భక్తులు ప్లాస్టిక్‌ వస్తువులు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ వస్తువులు తెచ్చుకోవాలని వెల్లడించింది. స్టీలు పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు వంటివి తెచ్చుకోవాలని పేర్కొంది. జాతర ప్రాంతంలో వీలైనంత చెత్త తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతోంది. జాతరకు వచ్చిన భక్తులు అక్కడి ప్రదేశాల్లో చెత్తాచెదారం పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించింది.

ఆర్టీసీ కీలక ప్రకటన
మేడారం మహా జాతరకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌలభ్యం ఉంటుందా లేదా అనే సందేహాలకు తెర పడింది. జాతరకు కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. అయితే భక్తులు మాత్రం తప్పనిసరిగా ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆధార్‌ కార్డు లేనివారు బస్సులో టికెట్‌ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. జిరాక్స్‌లు చెల్లుబాటు కావాలని చెప్పారు.

వీటన్నిటి ప్రకటనలతో మేడారం వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు వెంట పెట్టుకుని వెళ్లాల్సిందే. దీంతోపాటు ప్లాస్టిక్‌ వస్తువులు కాకుండా వాటికి ప్రత్యామ్నాయ వస్తువులు తీసుకెళ్లండి. దీని ద్వారా పరిశుభ్రతతోపాటు అటవీ ప్రాంతానికి మేలు చేసిన వారవుతారు. ఇంతకీ జాతరలో ముఖ్య ఘట్టాలు ఏమిటో తెలుసా.?

ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు
ఫిబ్రవరి 22న సమ్మక్క దేవ
ఫిబ్రవరి 23న సమ్మక్క, సారక్క భక్తులకు దర్శనం
ఫిబ్రవరి 24న దేవతల వన ప్రవేశం
ఫిబ్రవరి 28న జాతర పూజల ముగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News