Deputy cm Bhatti vikramarka good news for TGPSC dsc and groups aspirants: తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగుల నిరసలను హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క గాంధీ భవన్ వేదికగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యాగాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాలకోసమే అన్నారు . నీళ్లు, నిధులు, నియామకాలు అనేక నినాదంమీదనే తెలంగాణ ఏర్పడిందన్నారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితం తెలంగాణఅని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యోగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
6000 ఉద్యోగాలు వున్నాయి.. కొన్ని నెలల తరువాత మళ్ళీ ఇంకో డీఎస్సీ - ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క pic.twitter.com/RKjpJCO4vL
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2024
విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలని డీఎస్సీని ప్రకటించామన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు డీఎస్సీని గత ప్రభుత్వం నిర్వహించలేదన్నారు. కేవలం.. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసి ఓట్లకోసం తాపాత్రయ పడ్డారని భట్టీ విమర్శించారు. 5వేలకు నోటిఫికేషన్ ఇచ్చికూడా ఎగ్జామ్ లు నిర్వహించలేకపోయారని, తమ ప్రభుత్వం ఆ పోస్టులను 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ఇప్పటికే.. 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, మరో 19,718 టీచర్ ల ప్రమోషన్ లు, బదిలీలు చేపట్టామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఖాళీల మీద అవగాహన వస్తుందన్నారు. కాగా, ఇప్పటికే.. డీఎస్సీలో.. 2లక్షల 500కు పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
కొంతమంది పోస్ట్ ఫోన్ చేయమని ధర్నాలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాం లో పేపర్ లేకేజీల తో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రూప్ 2 కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారని భట్టీ అన్నారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రూప్ 3 కూడా నిర్వహించలేకపోతే మళ్ళీ మేం షెడ్యూల్ చేశమని భట్టీ అన్నారు.
ఇవన్నీకూడా నిరుద్యోగులకు నష్టం కలుగొద్దని తమ తాపత్రయమన్నారు. ఇవి మాత్రమే కాకుండా.. వివిధ శాఖలలో పోస్టులు 13321 టీజీపీఎస్సి ఆధ్వర్యంలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. డీఎస్సీని కూడా పకట్భందిగా నిర్వహిస్తామన్నారు. దీనితో పాటు మరో 6వేల పోస్టులతో మరో డీఎస్సీకి నోటీఫికేషన్ కు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులంతా.. మంచిగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుకుటున్నామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి