Janwada Rave party: రాజ్ పాకాలా పార్టీలో కేటీఆర్, శైలీమా..?.. కాకరేపుతున్న తెలంగాణ రాజకీయాలు..

Janwada rave party case: జన్వాడ రేవ్ పార్టీ ఘటన తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. దీనిపై ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తొందని చెప్పుకొవచ్చు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 27, 2024, 02:45 PM IST
  • తెలంగాణలో రచ్చగా మారిన జన్వాడ ఘటన..
  • భారీగా దొరికిన విదేశీ మద్యం..
Janwada Rave party: రాజ్ పాకాలా పార్టీలో కేటీఆర్, శైలీమా..?.. కాకరేపుతున్న తెలంగాణ రాజకీయాలు..

Janwada rave party issue in cyberabad: రాజేంద్ర నగర్ లోని జన్వాడ ఫామ్ హౌస్ లో  రేవ్ పార్టీ జరుగుతుందని స్థానికులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డీజే సౌండ్ లు,  లైటింగ్ లో ఉండటంను స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి దీనిపై విచారణ చేపట్టారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.  ఆ ఫామ్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ కు చెందిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదని  తెలుస్తొంది. అంతే కాకుండా..  అక్కడ నలభై మంది వరకు రేవ్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విదేశీ మద్యంను, కొకైన్ వంటివి అక్కడ ఉండటంను పోలీసులు గుర్తించారు.

దీంతో ఎస్ ఓటీ పోలీసులు అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ఎస్ ఓటీ పోలీసులు 24 మందికి టెస్ట్ లు చేయడగా.. విజయ్ మజ్దూరీ అనే బిజినెస్ మెన్ తో పాటు మరో ఇద్దరికి కూడా పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో వీళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎస్ఓటీ పోలీసులు  రేవ్ పార్టీలో దొరికిన వారిపై..  NDPS యాక్ట్‌, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఏ1 గా కార్తీక్, ఏ2 గా రాజ్ పాకాలపై కేసులను నమోదు చేసినట్లు తెలుస్తొంది.
అయితే.. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి రేవ్ పార్టీ వెనుకాల ఎవరున్న వెంటనే బైటకు తీసుకొని రావాలన్నారు. గతంలో మాదిరిగా పలుకేసుల్లో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంటూ.. అనేక కేసుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కుమ్మక్కైయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం రేవ్ పార్టీలో ఎవరున్న కూడా సీసీటీవీ ఫుటేజీలు ప్రజల ముందుంచాలన్నారు. తప్పులు చేసిన వారు ఎవరైన బైటపడాలన్నారు. ఇప్పటికే దీనిపై ఎంపీ రఘునందన్ రావు సైతం మాట్లాడారు. డ్రగ్స్ పార్టీలో ఎవరున్న కూడా అందర్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ ఉన్న..లేదా మరేవరున్న కూడా.. సీసీటీడీ ఫుటేజ్ లను చూపించాలన్నారు. దీనిపై ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్ కూడా స్పందించారు. రేవ్ పార్టీ ఘటనపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవ్ పార్టీ వెనుక బీఆర్ఎస్ ఉందని, వెనుకుండి.. తెలంగాణ డ్రగ్స్, రేవ్ పార్టీలను ప్రొత్సహిస్తున్నారన్నారు. దీనిపై  ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. మరోవైపు దీనివెనుక ఉన్న కీలక నేతల్ని ఇప్పటికే తప్పించారని,  అందుకే ఈ ఘటనపై పోలీసులు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ నోరు విప్పడం లేదని కూడా బండి సంజయ్ కాంగ్రెస్ ను ఏకీపారేశారు.

Read more: Janwada rave party: కేటీఆర్ నోరువిప్పాలి.. జన్వాడ రేవ్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..

ఇదిలా ఉండగా.. మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సౌత్ కొరియాలోని సియోల్ నుంచి మాట్లాడుతూ.. దీపావళికి ముందు తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం, ఫోన్ టాపింగ్, ధరణి వంటి వాటిల్లో అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు అరెస్టుల పర్వం ఉంటుందంటు బాంబు పేల్చారు.

దీన్ని బట్టి ఈ ఘటన అలాంటి కోవకు చెందిందని అనుకొవచ్చా.. అంటూ కొంత మంది డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ రేవ్ పార్టీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణి శైలీమా కూడా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News