Nagarjuna sagar Bypoll: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు

Nagarjuna sagar Bypoll: తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు అన్నివర్గాల్నించి మద్దతు లభించడంతో ప్రచారం జోరందుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2021, 11:39 AM IST
Nagarjuna sagar Bypoll: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు

Nagarjuna sagar Bypoll: తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు అన్నివర్గాల్నించి మద్దతు లభించడంతో ప్రచారం జోరందుకుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక(Nagarjuna sagar Bypoll)అనివార్యమైంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ నోముల నర్శింహయ్య కుమారుడు నోముల భగత్‌ను రంగంలో దింపింది. ఇప్పుడీ ఎన్నిక విషయంలో సీపీఎం (CPM) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు ప్రభుత్వ విధానాలపై టీ్ఆర్ఎస్(TRS)‌తో పోరాడుతున్న సీపీఎం..ఉపఎన్నికలో మాత్రం నోముల భగత్(Nomula Bhagat)‌కు మద్దతు తెలిపింది. నియోజకవర్గంలో ఏర్పడిన స్థానిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవల్సివచ్చిందని సీపీఎం తెలిపింది.

నోముల భగత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు, వామపక్ష అభిమానులు భగత్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చాయి సీపీఎం పార్టీ వర్గాలు. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 

Also read: COVID-19 Positive Cases: తెలంగాణలో ఫలితాలు ఇస్తున్న Face Masks, కరోనా కేసులు తగ్గుముఖం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News