Corona second wave: కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. గంటల వ్యవధిలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగింది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్ కట్టడి సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ(Telangana)లో కోవిడ్ సెకండ్ వేవ్ (Corona second wave) కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిందా..అవుననే అంటున్నాయి గాంధీ ఆసుపత్రి వర్గాలు. గంటల వ్యవధిలో కమ్యూనీటి స్ప్రెడ్‌కు లోనవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది.ఇక ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్(Lockdown), కర్ఫ్యూలతో(Curfew)పెద్దగా ఫలితాలుండవని..ప్రజలంతా స్వచ్ఛంధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగుల్ని మాత్రం గాంధీ ఆసుపత్రిలో ఇకపై చేర్చుకోనున్నారు. మొదటి వేవ్‌లో కరోనా సోకిన 2-3 రోజులకు శరీరంలో వైరస్ లోడ్ పెరిగేదని..ఇప్పుడు మాత్రం గంటల వ్యవధిలో పెరిగిపోతోందని తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ మరో మూడు నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.సెకెండ్‌వేవ్‌లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ (Coronavirus)మానవ శరీరంలోని లీవర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. శరీరంలో చేరిన వైరస్ రక్త ప్రసరణకు అడ్డుపడటంతో పెద్దసంఖ్యలో బాధితులు పక్షవాతానికికు గురవుతున్నారని, ఊపిరితిత్తులపై ఎటాక్ చేయడంతో శ్వాస అందక ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారని వివరించారు. గాంధీ ఆసుపత్రిలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలతోపాటు నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మందుల కొరత లేదని గాందీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Also read: Telangana COVID-19 Cases: తెలంగాణలో 4 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు, బీ అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboon