తెలంగాణ ఎన్నికలు: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాము బరిలోకి దించుతున్న అభ్యర్థుల మూడో జాబితాని కాంగ్రెస్‌ ప్రకటించింది. 

Last Updated : Nov 17, 2018, 11:35 AM IST
తెలంగాణ ఎన్నికలు: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాము బరిలోకి దించుతున్న అభ్యర్థుల మూడో జాబితాని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో 13 మందికి స్థానం కల్పించింది. ఈ జాబితాతో ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించినట్లు అయ్యింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మరి కొద్ది గంటలలో లేదా రేపు కాంగ్రెస్ ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేస్తోంది. 

తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడవ జాబితాలో అభ్యర్థుల వివరాలు ఇవే..

బహదూర్‌పుర - కలేం బాబా
కొల్లాపూర్‌ - బీరం హర్షవర్ధన్‌రెడ్డి
దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్‌
తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్‌
జనగామ - పొన్నాల లక్ష్మయ్య
బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్‌
ఎల్బీనగర్‌ -డి. సుధీర్‌రెడ్డి
కార్వాన్‌-ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజారి
యాకుత్‌పురా- కె. రాజేందర్‌ రాజు
ఇల్లందు(ఎస్టీ)- బానోత్‌ హరిప్రియ నాయక్‌
భోథ్‌(ఎస్టీ)- సోయం బాపురావు
నిజామాబాద్‌ అర్బన్‌-తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌
నిజామాబాద్‌ రూరల్‌ - డా. రేకుల భూపతి రెడ్డి

Trending News