Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?

Congress Party Special Manifesto For Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరో మేనిఫెస్టోను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 3, 2024, 01:17 PM IST
Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?

Congress Manifesto: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా జాతీయ మేనిఫెస్టో ప్రాంతీయ మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా రాష్ట్రానికి మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో ఆ మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ విడుదల చేశారు.

Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్‌ రెడ్డి

 

మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు. మేనిఫెస్టోలో 33 అంశాలు చేర్చామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. క్రీడలను ప్రోత్సహిస్తామని, కొత్తగా విశ్వవిద్యాలయాలు తీసుకొస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు, ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలపడం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొస్తామని మేనిఫెస్టోలో వివరించారు.

Also Read: Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. ఫేక్‌ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్‌?

 

హైదరాబాద్‌కు యూపీఏ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తాము వచ్చాక ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కొత్తగా సైనిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. నీతి ఆయోగ్‌ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం, డ్రై పోర్టు వంటి హామీలు ఇచ్చింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో న్యాయ్‌పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే.

జాతీయ, రాష్ట్ర మేనిఫెస్టోలను ఉపయోగించి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేయనుంది. ఈ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని పార్టీ ఆదేశించింది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్‌ రెడ్డి ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న రేవంత్‌ రెడ్డి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తుండడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News