Congress V Hanumantha Rao House Attacked: కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంటిపై బుధవారం (ఏప్రిల్ 14) అర్ధరాత్రి గుర్తు తెలియని దండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్విన దుండగలు... ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. దాడి సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నారు. దాడి ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
దాడిపై వీహెచ్ మాట్లాడుతూ... మాజీ పీసీసీ అధ్యక్షుడిని, మాజీ మంత్రిని అయిన తనకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. ఇవాళ ఇది జరిగింది... రేపు ఇంకొకటి జరగవచ్చునని అన్నారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం భద్రత కూడా కల్పించలేదని మండిపడ్డారు. తనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ ముందుంటానని... అలాంటి తనపై ఈ దాడికి పాల్పడిందెవరో బయటపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.
వీహెచ్ ఇంటిపై దాడి ఘటనను రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నాయకులపై దాడులను సహించేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ప్రజల మనిషి అని... ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటారని పేర్కొన్నారు.
కాగా, గతంలో రేవంత్ రెడ్డి అభిమాని ఒకరు వీహెచ్‌ను ఫోన్ ద్వారా బెదిరించిన సంగతి తెలిసిందే. రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవిని వీహెచ్ వ్యతిరేకించడంతో... సదరు వ్యక్తి వీహెచ్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీనిపై వీహెచ్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Monitor Lizard Raped: షాకింగ్... ఉడుముపై గ్యాంగ్ రేప్... సెల్‌ఫోన్లలో చిత్రీకరణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook