TS Congress: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్...

Komatireddy Venkat Reddy appointed as Star Campaigner: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 01:37 PM IST
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక పదవి
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ
  • ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి
TS Congress: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్...

Komatireddy Venkat Reddy appointed as Star Campaigner: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించాలనే ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమలవుతుందన్నారు.

నిజానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పోస్టుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్ఠానం ఆ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడంతో ఆయన నొచ్చుకున్నారు. పార్టీలో సీనియర్లను కాదని... తమ కన్నా జూనియర్‌కు... అదీ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించడంపై ఆయన పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయి రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక గాంధీ భవన్ మెట్లు ఎక్కేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాక చాలా రోజులు ఆయన్ను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు.

కొందరు కాంగ్రెస్ పెద్దల జోక్యంతో ఆ మధ్య ఇందిరాపార్క్ వద్ద రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు కోమటిరెడ్డి హాజరయ్యారు. అలా మొదటిసారి రేవంత్, కోమటిరెడ్డి ఒకే వేదికపై కనిపించారు. కోమటిరెడ్డిని పార్టీలో మరింత యాక్టివ్ చేయాలంటే ఆయనకు కీలక పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు స్టార్ క్యాంపెయిన్ పదవిని కట్టబెట్టినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాదే తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటినుంచే రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసినట్లు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. 

Also Read: RRR @1000 Crores: రూ. 1000 కోట్ల క్లబ్ దాటిన ఆర్ఆర్ఆర్.. తొక్కుకుంటూ పోతున్న తెలుగు సినిమా 

KGF 2 First Review: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. 'క్లైమాక్స్ గూస్ బంప్స్' అంతే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News