Munugode ByElection: ఇదేందయా ఇది.. కాంగ్రెస్ దూకుడుతో టీఆర్ఎస్ లో సంబరం!

Munugode ByElection: మునుగోడు ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు టీమ్ తో సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ దూకుడుతో టెన్షన్ పడాల్సిన అధికార టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 3, 2022, 05:34 PM IST
  • మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్
  • కాంగ్రెస్ దూకుడుతో టీఆర్ఎస్ లో జోష్
  • త్రిముఖ పోరు అధికార పార్టీకి లాభమా?
Munugode ByElection: ఇదేందయా ఇది.. కాంగ్రెస్ దూకుడుతో టీఆర్ఎస్ లో సంబరం!

Munugode ByElection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రానుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంపైనే ఫోకస్ చేశాయి. పోటాపోటీ వ్యూహలతో మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర పరిణామం జరుగుతోంది. ఏదైనా ఎన్నికల్లో ఓ పార్టీ దూకుడుగా వెళుతుంటే.. వాళ్ల ప్రత్యర్థి పార్టీలకు టెన్షన్ పట్టుకుంటుంది. ఎన్నికల రేసులో తాము వెనకబడి పోతామనే ఆందోళన కనిపిస్తుంటుంది. కాని త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో మాత్రం సీన్ మరోలా ఉంది. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ యమ స్పీడులో దూసుకుపోతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. మునుగోడు ఉప ఎన్నిక కోసం స్ట్రాటజీ, ప్రచార కమిటీని ప్రకటించింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కన్వీనర్ గా ఏడుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. అంతేకాదు శుక్రవారం మునుగోడులో బల ప్రదర్శన చేయబోతోంది కాంగ్రెస్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మునుగోడుకు వెళుతున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు టీమ్ తో సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ దూకుడుతో టెన్షన్ పడాల్సిన అధికార టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంత దూకుడు పెంచింతే తమకు అంతగా కలిసివస్తుందనే లెక్కలు వెస్తోంది గులాబీ పార్టీ. ఇందుకు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో  ద్విముఖ పోటీనే జరిగింది. దుబ్బాక, హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరగగా.. కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ జరగగా.. బీజేపీ నామమాత్రంగా నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కారు పార్టీ గెలిచింది. అయితే ఈసారి మునుగోడులో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో త్రిముఖ పోరు ఖాయమని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు అధికార పార్టీకి వరంగా మారనుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే త్రిముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుంది. ఇది అధికార పార్టీకి అనుకూలమవుుతంది. మునుగోడు నియోజకవర్గంలో ఇదే జరిగే అవకాశం ఉందనే అంచనాలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని తెలుస్తోంది.దుబ్బాకలో కాంగ్రెస్ బలంగా ఉంటే కారు పార్టీనే గెలిచేది. అలాగే హుజురాబాద్ లో కాంగ్రెస్ కు మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఈటల రాజేందర్ కు టర్న్ అయిందనే వార్తలు వచ్చాయి. హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. టీఆర్ఎస్ కు ఫ్లస్ అయ్యేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పోటీలో లేదు కాబట్టే ఈటల గెలవగలిగారని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు మునుగోడులో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండు హోరాహోరీగా పోరాడుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం. సో.. ఇది అధికార టీఆర్ఎస్ కు మేలు చేస్తుందనే టాక్ వస్తోంది.

మునుగోడులో తాజాగా జరుగుతున్న పరిణామాలతో టీఆర్ఎస్ లో జోష్ కనిపిస్తుందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంత బలంగా ఉంటే తమకు అంతగా కలిసివస్తుందని కారు పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. మునుగోడు తరహా రాజకీయమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉంటుందని... ఈ అంచనాతోనే హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ధీమాగా ఉన్నారని అంటున్నారు. విపక్షాలు రెండు బలంగా ఉండేలా కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని.. కావాలనే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని రెచ్చగొడుతూ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా మునుగోడులో కాంగ్రెస్ దూకుడు పెంచడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసివచ్చేలా ఉందనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Read  also: Rajgopal Reddy: రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ మంత్రిపదవి ఆఫర్? రాయబారం నడిపింది ఎవరు?

Read  also: Rajgopal Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా? కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News