Telangana Forecast: తెలంగాణలో ఉగ్రరూపం దాల్చనున్న ఎండలు.. ఢిల్లీ ఎండలపై కేంద్ర మంత్రి అలర్ట్‌

Telangana Forecast Coming Two Days: మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో మళ్లీ ఎండల వేడిమి మొదలవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చుంటున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 29, 2024, 09:52 PM IST
Telangana Forecast: తెలంగాణలో ఉగ్రరూపం దాల్చనున్న ఎండలు.. ఢిల్లీ ఎండలపై కేంద్ర మంత్రి అలర్ట్‌

Telangana Forecast: రెండు వారాలపాటు అకాల వర్షాలతో కొంత ఎండల నుంచి ఉపశమనం పొందిన తెలంగాణ ప్రజలు తాజాగా మళ్లీ ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోత మొదలైంది. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక బుధవారం విడుదల చేసింది.

Also Read: Cows Death: మూగ రోదన.. లారీలో కుక్కేయడంతో ఊపిరాడక 16 ఆవులు మృతి

 

వాతావరణ విశ్లేషణ: బుధవారం ఉదయం 08:30 ఆధారంగా వాతావరణ శాఖ విభాగం కీలక సూచనలు చేసింది. నైరుతి రుతు పవనాలు రాగల 24 గంటలలో కేరళలో ప్రవేశించటానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. రాష్ట్రంలో కింద స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నావని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షం సూచన లేదు. రాగల 3 రోజులు ఎలాంటి పరిస్థితి ఉంటుందో వాతావరణ శాఖ తన నివేదిక ఇచ్చింది.

Also Read: Delhi Temperature Today: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. 100 ఏళ్ల రికార్డులు బద్ధలు

బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షంతోపాటు మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ హెచ్చరికలపరంగా చూస్తే ఎలాంటి హెచ్చరికలు లేవని ఆ శాఖ అధికారులు తెలిపారు.

ఢిల్లీ వాతావరణంపై కేంద్ర మంత్రి స్పష్టత
దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యధికంగా 53 శాతం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రోజులు నమోదైన ఉష్ణోగ్రతలు విడుదల చేశారు. ఢిల్లీవ్యాప్తంగా నమోదైన వాతావరణ శాఖ రిపోర్టును కేంద్ర మంత్రి తన ట్విటర్‌లో పంచుకున్నారు. 52.3 డిగ్రీల సెల్సియస్‌ డిగ్రీలు నమోదయ్యాయనే వార్తలు రావడంతో అది వాస్తవమో కాదో తమ శాఖ వెల్లడిస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News