colonel Santosh Babu with Mahavir Chakra: తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు(Col Santosh Babu)ను కేంద్రం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది. గతేడాది జూన్‌లో గల్వాన్ లోయ(Galwan valley)లో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి సంతోష్‌బాబు వీరమరణం పొందారు. అనంతరం ఆయనకు ప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డు(Mahavir Chakra 2021)ను ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ సతీమణి, తల్లి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Col Santosh Babu accorded Mahavir Chakra posthumously for resisting Chinese Army attack while establishing an observation post in the face of the enemy in Galwan valley in Ladakh sector during Operation Snow Leopard.
His mother and wife receive the award from President. pic.twitter.com/oxonlAvEWL
— ANI (@ANI) November 23, 2021
Also Read: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. బాలికపై సివిల్ ఢిఫెన్స్ అధికారి అత్యాచారం
నల్గొండ జిల్లా సూర్యాపేట(Suryapeta)కు చెందిన సంతోష్‌బాబు.. 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. సంతోష్‌బాబుతో పాటు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు చాటిన పలువురు జవాన్లు, వీరమరణం పొందిన అమరుల కుటుంబసభ్యులకు రాష్ట్రపతి(Ram Nath Kovind) గ్యాలంటెరీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook