KCR Munugode Campaign: మునుగోడు ఉప ఎన్నికలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మంగళవారం నుంచి రంగంలోకి దిగారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులోనే మకాం వేశారు. అధికార నుంచి పార్టీ నుంచి 14 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు తమకు కేటాయించిన గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే మునుగోడుకు సంబంధించి తాజాగా సంచలన విషయం తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారని.. మునుగోడులోనే ఉండి ప్రచారాన్ని పరుగులు పెట్టించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హస్తినలో ఉన్న కేసీఆర్ బుధవారం హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది. తర్వాత గురు లేకా శుక్రవారం ఆయన మునుగోడు వెళ్లనున్నారని తెలుస్తోంది. వారం రోజుల పాటు కేసీఆర్ మునుగోడులోనే మకాం వేస్తారని అంటున్నారు.
తెలంగాణ సీఎంవో అధికారులు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన, బసకు సంబంధించిన ఏర్పాట్ల కోసమే సీఎంవో అధికారులు మునుగోడులో తిరుగుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ బస కోసం మునుగోడు, చండూరు, చౌటుప్పల్ లో భవనాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ముడింటిలో ఏదో ఒకటి కన్ఫ్యామ్ చేసిన తర్వాత కేసీఆర్ మునుగోడుకు వస్తారని.. వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఆందుకే స్వయంగా ఆయన రంగంలోకి దిగనున్నారని సమాచారం. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో మునుగోడుకు వెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అవసరమైతే మునుగోడు ప్రచార గడువు ముగిసేలోపు అక్కడే ఉండి.. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లి ఓటర్లతో మాట్లాడాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
మంగళవారం దాదాపు వంద కార్లతో మునుగోడు ప్రచారానికి వెళ్లారు సంజయ్. సంజయ్ రోడ్ షోలో స్థానికులు కాకుండా బయటి జనం ఉన్నారని టీఆర్ఎస్ చెబుతోంది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వందలాది కార్లలో వేలాదిగా బయటి జనాలను తరలిస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తుందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తన చేతల్లో పెట్టుకొని బీజేపీ కుట్రలు చేస్తుందని భావిస్తున్న కేసీఆర్.. బీజేపీకి కౌంటర్ గా వందలాది కార్ల కాన్వాయ్ తో మునుగోడుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. నేనే స్వయంగా దిగుతా.. ఏం జరుగుతుందో చూద్దామంటూ కేసీఆర్ ఢిల్లీలో తనతోపాటు ఉన్న ముఖ్యులతో అన్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక భారత రాష్ట్ర సమితి భవిష్యత్ కార్యాచరణకు వేదిక కానుందని కూడా కేసీఆర్ అన్నారని తెలుస్తోంది. దీంతో మునుగోడులో భారీ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.
మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పైనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. విద్వేష ప్రసంగాలతో జనాలను రెచ్చగొడుతున్నసంజయ్ను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనకుండా నియంత్రించాలని
టీఆర్ఎస్ కోరింది. టీఆర్ఎస్ వాళ్లు డబ్బులు తీసుకోండి.. ఓటును మాత్రం బీజేపీకే వేయాలని సంజయ్ చెబుతున్నారని.. ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓటర్లను అవినీతికి పాల్పడేలా ప్రోత్సహిస్తున్న సంజయ్ ను స్టార్ క్యాంపెయినర్‌గా అనర్హుడిని ప్రకటించాలని ఈసీకి విన్నవించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి