Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణమాలు జరుగుతున్నాయిని తెలుస్తోంది. అభ్యర్థి విషయంలో ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం.కొన్ని రోజులుగా జరుగుతున్నపేరు కాకుండా కొత్త అభ్యర్థిని ఖరారు చేయనున్నారనే టాక్ వస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 19, 2022, 10:57 AM IST
  • మునుగోడు టీఆర్ఎస్ లో ట్విస్ట్
  • అభ్యర్థి విషయంలో కేసీఆర్ పునరాలోచన
  • నియోజకవర్గంలో భారీగా కర్నె ఫ్లెక్సీలు
Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?

Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. శనివారం మునుగోడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండగా.. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఉంది. అమిత్ షా సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇద్దరు ముఖ్యనేతల సభలతో మునుగోడులో వాతావరణం హీటెక్కింది. అదే సమయంలో  నియోజకవర్గంలో వలసల పర్వం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణమాలు జరుగుతున్నాయిని తెలుస్తోంది. అభ్యర్థి విషయంలో ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం. మునుగోడు సభలో అభ్యర్థి పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్నపేరు కాకుండా కొత్త అభ్యర్థిని ఖరారు చేయనున్నారనే టాక్ వస్తోంది.

మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం లాంఛనమే. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బడా బిల్దర్ చలమల కృష్ణారెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. అధికార పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేశారని ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే కేసీఆర్ సభ దగ్గరపడిన కొద్ది ఆ సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ సభ కోసం నియోజకవర్గవ్యాప్తంగా అధికార పార్టీ వేసిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లలో ఎక్కడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు కాని ఫోటో కాని లేదు. మునుగోడు బహిరంగ సభా ప్రాంగణంలోనూ ఎక్కడా కూసుకుంట్ల ఫ్లెక్లీ కాని బ్యానర్ కాని ఏర్పాటు చేయలేదు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. కూసుకుంట్ల ఫోటోలు కనిపించగపోగా.. ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ పేరుతో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. హైదారాబాద్ శివారు ప్రాంతం నుంచి మునుగోడు వరకు.. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కర్నె ప్రభాకర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, నిలువెత్తు  కేసీఆర్ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. సీఎం బహిరంగ సభా ప్రాంగణంలోనూ అదే సీన్. ఎక్కడా కూసుకుంట్ల ఫోటోలు లేకపోగా.. కేసీఆర్, కేటీఆర్, కర్నె ప్రభాకర్ ఉన్న పెద్దపెద్ద హోర్డింగులు, బ్యానర్లు కట్టారు.

ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చగా మారింది. కూసుకుంట్లకు టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచలోనే ఉన్నందునే ఆయన ఫోటోలు లేకుండా వాల్ పోస్టుర్లు, బ్యానర్లు కట్టించిదని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక టికెట్ రేసులో కర్నె ప్రభాకర్ ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉన్నందున.. ఆ సామాజిక వర్గానికి చెందిన కర్నె ప్రభాకర్ కు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బహిరంగ సభకు ముందు చోటు చేసుకున్న పరిణామాలతో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. మారిన రాజకీయ పరిస్థితులతో కూసుకుంట్లకు కాకుండా బీసీ వర్గానికి చెందిన కర్నెకి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారా అన్న చర్చ జనాల్లో సాగుతోంది.

మునుగోడు టీఆర్ఎస్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బాగా అసమ్మతి ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఏకంగా 3 వందల మంది నేతలు సమావేశం పెట్టి తీర్మానం చేశారు. నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో 10 శాతం మద్దతు కూడా కూసుకుంట్ల లేదని తెలుస్తోంది. అయినా మంత్రి జగదీశ్ రెడ్డి మద్దతుతో కూసుకుంట్లకే టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో చౌటుప్పల్ ఎంపీసీ తాడురి వెంకట్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. చండూరు, మునుగోడు మండలాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలానికి జై కొట్టారు. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న మరికొంత మంది నేతలు సీఎం సభ కోసం ఎదురుచూస్తున్నారు. మునుగోడు సభలో కూసుకుంట్ల పేరును ప్రకటిస్తే తమదారి తాము చూసుకోవాలనే యోచనలో గులాబీ లీడర్లు ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 70 మంది సర్పంచ్ లు, ఎంపీటీసీలు తమతో టచ్ లో ఉన్నారని.. అమిత్ షా సభలో సంచలనం జరగబోతోందని కమలం లీడర్లు చెబుతున్నారు.

కేసీఆర్ సభకు జన సమీకరణ కోసం మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించింది పార్టీ అధిష్టానం. ఆ ఎమ్మెల్యేలంతా వారం రోజులుగా తమకు కేటాయించిన మండలాల్లో తిరుగుతున్నారు. గ్రామాల్లో కూసుకుంట్లకు వ్యతిరేకంగా నేతలు తమ గళాన్ని వినిపించారని తెలుస్తోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే మాత్రం తాము పనిచేయలేమని కొందరు నేతలు ఎమ్మెల్యేల ముఖాల మీదే చెప్పారని తెలుస్తోంది. ఇంకొదరు నేతలు బీజేపీ, కాంగ్రెస్ నుంచి రెడ్డీలు పోటీలో ఉంటున్నదున.. బీసీకి ఇవ్వాలని సూచించారట. గ్రామ నేతల అభిప్రాయాలను పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలు నివేదించారని తెలుస్తోంది. దీంతో మునుగోడు అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచన చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కూసుకుంట్ల పేరు, ఫోటో లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కర్నెప్రభాకర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు వెలవడంపై జనాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కూసుకుంట్లకు కాకుండా కర్నె ప్రభాకర్ కు టికెట్ ఇస్తారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఉద్యమకారుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కర్నె అయితేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టారనే వాదన టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందని సమాచారం. మొత్తంగా మునుగోడు సభలో కేసీఆర్ అభ్యర్థిని ప్రకటిస్తారా లేక మరికొంత కాలం వెయిట్ చూసేందుకు అభ్యర్థి ప్రకటన లేకుండా ముగిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.

Read also: నితీశ్ వ్యవహారం అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లుగా ఉంది.. బీహార్ సీఎంపై బీజేపీ నేత అనుచిత విమర్శలు     

Read also: Big Debate With Bharath : కోమటిరెడ్డిపైకి అద్దంకిని ఉసిగొల్పింది రేవంత్ రెడ్డేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News