సమ్మక్క-సారక్కలను దర్శించుకోనున్న సీఎం కేసీఆర్

ప్రపంచ గిరిజన జాతరకు కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు 

Last Updated : Feb 2, 2020, 11:34 PM IST
సమ్మక్క-సారక్కలను దర్శించుకోనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: ప్రపంచ గిరిజన జాతరకు కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం మేడారం రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారుకు సూచించారు. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్న, ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసిందని అన్నారు. మేడారం జాతర సందర్భంగా మార్గంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. కోట్లాది మంది ప్రజలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వస్తున్న తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 
  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News