CM KCR: జనగామలో కేసీఆర్ ప్రసంగం.. అప్పటి జనగామ పరిస్థితులు గుర్తు చేసుకున్న కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల హారన్ మోగింది. ఎప్పటిలాగే గులాబీ బాసు ప్రచారంలో ముందున్నారు. ప్రచార సభలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న సీఎం ఈ రోజు జనగామలో ప్రసంగించారు. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 07:36 PM IST
CM KCR: జనగామలో కేసీఆర్ ప్రసంగం..  అప్పటి జనగామ పరిస్థితులు గుర్తు చేసుకున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవగానే సీఎం కెసిఆర్ పబ్లిక్ మీటింగ్ రూట్ రెడీ  చేస్తుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జనగామలో పర్యటించారు. జనగామలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో జనగామ పరిస్థుతలను గుర్తు చేస్తున్నారు.  

కేసీఆర్ మాట్లాడుతూ..  జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేది. గుర్తు చేసుకుంటేనే..  భయమయ్యే పరిస్థితులు..  కంటికి నీళ్లచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు.. రాష్ట్రం నలు మూలాల అన్ని జిల్లాలు, అన్ని మండలాలు మూల మూల తిరిగాను. ఎనిమిది పది చోట్ల  కన్నీళ్లు కూడా వచ్చాయి.  చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజీ మీదనే ఎడ్చినా రోజులు కూడా ఉన్నాయి. అలా నేను ఏడ్చినటువంటి ప్రదేశాల్లో బచ్చన్నపేట మండల కేంద్రం కూడా ఒక్కటి. సిద్ధిపేట నుంచి సూర్యాపేటకు వయా బచ్చన్నపేట, జనగామ వెళ్తుంటే.. బచ్చన్నపేటలో కొద్దిమంది కలిసి ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసున్న ఏరియా ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళమని చెప్పారు. 

అపుడు నాలుగైదువందల మంది మాత్రమే ఉన్నారు. జనం కూడా లేరు. అక్కడ ఆగాకా.. జీపులో మైకు ఉంటే ఎక్కి మాట్లాడుతున్నా.. . ఎదురుగా చూస్తే ఒక్క యువకుడు కూడా లేడు. అందరు ముసలివాళ్లే ఉన్నరు. ఒక్క యువకుడు లేడు ఏంది కథ అంటే.. ఒక్క  యువకుడు కూడా లేడు సార్, ఇప్పటికే 8 ఏండ్లు కరువుపడి బచ్చన్నపేట చెరువు అడుగంటుకుని మొత్తం మునిగి పోయింది. ఎండిపోయింది. బావులల్లా కూడా నీళ్లు లేవు. బోర్లు కూడా  సరిగ్గా పోస్తలేవు. 8 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. బండి మీద బ్యారెళ్లు పెట్టుకుని అంటూ వాళ్లు ఏడ్చినరు  నాకు  కూడా దుఖ: ఆగలేదు. దగ్గరలోనే గోదావరి ఉంటది మనకు హక్కు ఉంటది.  

రోజుకు ఒక్క రోజు స్నానం చేయనటువంటి పరిస్థితుల్లో ఉండటం బాధ అనిపించింది.యువకులు మొత్తానికి మొత్తం అన్నమో రామచంద్ర అంటూ పొట్ట చేత పట్టుకుని వలుసలు పోయినటువంటి దుస్థితి కళ్లారా చూసి నేను ఏడ్చాను. ఈ  రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా మంది చాలా మాటలు చెప్పారు. నేను ఒక్కటే చెప్పినా.. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో ఒకటి లేదా రెండు ఎకనామిక్ గ్రోత్ సెంటర్లు కావాలే. ఎక్కడ అన్న పాయింట్ పెట్టండని అధికారులను కోరితే వారు వేరే వేరే పెట్టినారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినా, రెండవది భువనగిరి మీది పాయింట్ పెట్టినా. ఈ రెండు కూడా గ్రోత్ కారిడార్ అయ్యాయి. నీళ్లు వచ్చిన తర్వాత పాత  వరంగల్ జిల్లాలో  చూసుకున్నట్లయితే అత్యధికంగా వడ్లుపండించిన తాలుకానే జనగామ.

Also Read: Balakrishna: ఆడపిల్ల తల్లిదండ్రులకు భారీ క్లాస్ పీకిన బాలకృష్ణ

అప్పుడప్పుడు నేను తెలుసుకుంటావున్నా.. బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైందని. సార్ ఆనాడు ఎండిపోయింది.. కానీ ఇపుడు 365 రోజులు నిండే ఉంటుందని అధికారులు చెప్పినారు. హైదరాబాద్ కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 60 కిలోమీటర్లు ఉంటది జనగామ. ఉప్పల్ దాటి ఘట్ కేసర్ దాటిన తర్వాత చాలా దగ్గరగా ఉంటది. భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీయల్, ఐటీ కారిడార్ వంటి వాటితో చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశముంటది. ఎన్నికలు వస్తాయి. పోయాయ్..  ఎవరో ఒకరు గెలుస్తా ఉంటారు. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు.  పరేషాన్ కావద్దు. ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటువేయవద్దు. మన బావమరిది చెప్పిండో చుట్టం చెప్పిండో, మన మేనమామ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు. ఓటు అనేది మన తలరాతను మార్చుతది, తాలుకా రాతను మార్చుతది, మన రాష్ట్ర దిశను, దశను మార్చుతది. చాలా ముఖ్యమైన ఆయుధం. ప్రజా స్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దానిని ఎటు వినియోగిస్తమో మన ఖర్మ అటు వెళ్లిపోతది. ఎవడో వచ్చి ఏదో చెబితే నమ్మితే చాలా ప్రమాదమచ్చే ఆస్కారముంది.

మీకు చెప్పే సంతోషమైన వార్త ఏంటంటే.. ముత్తిరెడ్డి గారికి కూడా చెప్పిన దేవాదుల ప్రాజెక్టు ద్వారా కాకుండా కాళేశ్వరం లింకైన మల్లన్న సాగర్ మీ ఎత్తుమీద కుండలాగానే  ఉంటది. 50 టీఎంసీల ప్రాజెక్టు నుంచి కూడా టపాసుపల్లి రిజర్వాయరుకు లింకు చేస్తున్నాం. దీనివల్ల ఎక్కడ కరువొచ్చినా జనగామలో కరువు రాదు. నిశ్చింతంగా ఉండాలని మనవి చేస్తున్నా. కొన్ని కొన్ని రిపేర్లు, పంట కాలువలు కావాలని కావాలని కోరారు. అన్ని కూడా నా దగ్గర ఉన్నయ్. వాటన్నిటిని కూడా పరిశీలిస్తాను.  ఎలాగో నీళ్లు తెచ్చుకున్నాం. మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి. కొంత ఆయకట్టుకు అందుతా ఉంది.  రెండు మూడుల లిఫ్టులు పెట్టుకుంటే జనగామలో వందశాతం నీళ్లు వస్తాయి. అవి తెచ్చి నేను మీకు అప్పగిస్తా.. అని సీఎం కేసీఆర్ తెలిపారు. 

Also Read: Poco X5 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ డీల్‌..POCO X5 Pro 5G మొబైల్‌ కేవలం రూ. 5,550కే..ఆఫర్‌ వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News