Telangana: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

CM KCR condolences over Naini Narsimha Reddys Death | తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి (CM KCR condolences over Naini Narsimha Reddys Death) వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ (TRS) పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Last Updated : Oct 22, 2020, 09:06 AM IST
Telangana: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Naini Narsimha Reddy Death News | మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి (CM KCR condolences over Naini Narsimha Reddys Death) వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ (TRS) పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న నాయిని నర్సింహారెడ్డికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ అలాగే ఉండిపోయింది. గత కొంతకాలం నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యమనేత, మాజీ మంత్రి నాయిని బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుది శ్వాస విడవటం (Naini Narsimha Reddy Passes Away) తెలిసిందే.

 

 

‘తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ నాయకులు, రాష్ట్ర తొలి హోంమంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారి మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఘన నివాళులు’ అని టీఆర్ఎస్ పార్టీ సంతాపం ప్రకటించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News