Film Federation: తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్షోభానికి తెర పడింది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ఫలించాయి. సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి అంగీకారం కుదిరింది. రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ జరగనున్నాయి. పెరిగిన వేతనాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని సినీ నిర్మాత సి. కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎంత శాతం పెంచాలన్న దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. నిర్మాతల నుంచి కలెక్ట్ చేసి ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పెరిగిన మొత్తాలు అందిస్తామని తెలిపారు.
వేతనాలు ఎంత పెంచాలనేది రేపటి కో-ఆర్డినేషన్ భేటీలో నిర్ణయిస్తామన్నారు సినీ నిర్మాత సి. కళ్యాణ్ .కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా దిల్ రాజు ఉన్నారని వెల్లడించారు. వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మెతో 25కిపైగా సినిమాల షూటింగ్‌లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చివరకు ఈ అంశం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చేరింది. మంత్రి తలసానిని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు, నిర్మాతల మండలి నేతలు, కార్మిక నేతలు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా సమస్యలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు.
పంతాలు, పట్టింపులు వద్దని ఇరు పక్షాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించుకోవాలన్నారు. కరోనా పరిస్థితులతో సినీ కార్మికుల వేతనాలు పెరగలేదని తెలిపారు. ఇరువర్గాలు కూర్చుకుని చర్చించుకోవాలన్నారు మంత్రి తలసాని. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రెండు వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలన్నారు. ఈక్రమంలోనే ఇరుపక్షాలు సమావేశమై..వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
Also read:Maharashtra Political Crisis: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందా..సంజయ్ రౌత్ వాదన ఏంటి..!
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రాగం..రాగల మూడు రోజులపాటు వానలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook