Marriage was stopped because of Chicken in Hyderabad: సాధారణంగా పెళ్లిళ్లు ఆగిపోవడానికి ప్రధాన కారణం కట్నం, ప్రేమ వ్యవహారం. పెళ్లి సమయానికి కట్నం ఇవ్వలేదనో లేదా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పారిపోవడం లాంటి కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. అయితే తాజాగా ఓ పెళ్లి.. పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్ పెట్టలేదని ఆగిపోయింది. ఈ ఘటన మరెక్కడో జరగలేదు. హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన వరుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుకు పెద్దల సమక్షంలో వివాహం చేసేందుకు ఇటీవల నిశ్చయించారు. ఇందుకోసం అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. పెళ్లిని షాపూర్ నగర్‌లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. సోమవారం (నవంబర్ 28) తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివాహ ముహూర్తం. అయితే వివాహంకి ముందురోజు ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడపెళ్లి వారు బిహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబికులు కావడంతో.. శాకాహార వంటలు చేశారు. విందు దాదాపుగా పూర్తికావొచ్చింది.
విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. విందులో చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడ్డారు. చికెన్ లేకుండా పెళ్లి ఏంటి అంటూ భోజనం చేయకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వరుడి తరపు బంధువులు వచ్చిన వారికి కావలసింది వడ్డించలేదంటూ వధువు తరపు వారిని హేళన చేశారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఇరువైపుల బంధువులు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
గొడవ కారణంగా మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబికులు జీడిమెట్ల సీఐ పవన్‌ను కలిసి విషయం చెప్పారు. సీఐ రెండు కుటుంబాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరు కుటుంబాలతో మాట్లాడి వారికి నచ్చజెప్పారు. చివకు వారు ఒప్పుకున్నారు. ఈనెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
Also Read: Horoscope Today 29 November 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
Also Read: Girl Raped By Headmaster: బాలికపై నలుగురు మైనర్ల గ్యాంగ్ రేప్.. బాధితురాలిని రేప్ చేసి హెడ్ మాస్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.