తెలంగాణలో సుగంధ ద్రవ్యాల బోర్డు: పీయూష్ గోయల్

నిజామాబాద్​లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయి కార్యాలయంగా స్థాయి పెంచినట్లు తెలిపారు. ఐఏఎస్ 

Last Updated : Feb 4, 2020, 10:24 PM IST
 తెలంగాణలో సుగంధ ద్రవ్యాల బోర్డు: పీయూష్ గోయల్

హైదరాబాద్:  నిజామాబాద్​లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయి కార్యాలయంగా స్థాయి పెంచినట్లు తెలిపారు. ఐఏఎస్ హోదా ఉన్న అధికారి డైరెక్టర్ స్థాయి అధికారితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాలయం నేరుగా మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని పేర్కొన్నారు. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు గోయల్ తెలిపారు. ఇవాళ లేదా రేపు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని తెలిపారు. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తుందని ఆయన అన్నారు. 

పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని, రైతులకు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందని ఆయన అన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను కల్పించామన్నారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News