యువకుడి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

యువకుడి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

Last Updated : Mar 27, 2019, 11:15 AM IST
యువకుడి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

హైదరాబాద్: ద్విచక్ర వాహనం నడుపుతుండగా తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ పేలి ఓ యువకుడు గాయపడిన ఘటన మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అల్వాల్‌ మచ్చబొల్లారంలో అరటి పండ్ల వ్యాపారం చేసుకునే ఇమ్రాన్‌ (25) మంగళవారం ఉదయం బంధువుల అమ్మాయిని తిరుమలగిరిలోని 10వ తరగతి పరీక్ష కేంద్రానికి బైక్‌పై తీసుకెళ్తుండగా లోతుకుంట వద్ద ఈ ఘటన జరిగింది. ఉన్నట్టుండి ప్యాంట్ జేబులో వున్న సెల్ ఫోన్ పేలడంతో అతడు బైక్‌పై నుంచి ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. 

ఈ ప్రమాదంలో యువకుడి తల, తొడ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితుడు చికిత్స అనంతరం ఒప్పో కంపెనీ యాజమాన్యంపై బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితమే కొనుగోలు చేసిన ఒప్పో కంపెనీకి చెందిన సెల్‌ఫోన్‌ పేలిపోయిందని, ఫలితంగా తాను ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా ప్రమాదంబారిన పడ్డానని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Trending News