Munugode Bypoll: బ్రేకింగ్.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక.. ఈనెల 7 నుంచి నామినేషన్లు

Munugode Bypoll Schedule: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 7న రానుంది.నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ రావడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Written by - Srisailam | Last Updated : Oct 3, 2022, 02:12 PM IST
  • మునుగోడు బైపోల్ షెడ్యూల్ రిలీజ్
  • ఈనెల 7 నుంచి నామినేషన్లు
  • నవంబర్ 3న పోలింగ్
Munugode Bypoll: బ్రేకింగ్.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక.. ఈనెల 7 నుంచి నామినేషన్లు

Munugode Bypoll Schedule: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈనెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానుంది.నవంబర్ ౩న పోలింగ్ జరగనుందిఈనెల 7 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ రావడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

తెలంగాణలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బీహార్ లోని మెక్మా, గోపాల్ గంజ్, హర్యానాలోని అదంపూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకర్నాథ్, ఒడిశాలోని దామ్ నగర్ అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.

మునుగోడులో ఇప్పటికే  పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి పోటీ చేయనున్నారు. బీజేపీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం లాంఛనమే. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇంకా మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారైందని ప్రచారం సాగినా.. కేసీఆర్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మునుగోడు నియోజకవర్గంలో అంతా తానై ప్రచారం చేస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. అయితే కూసుకుంట్లకు వ్యతిరేకంగా అసమ్మతి తీవ్రంగా ఉంది.

Read Also: Rohit Sharma : టీ20 ప్రపంచకప్ కు రోహిత్ శర్మ దూరమా? ముక్కు నుంచి రక్తం కారడంతో అభిమానుల్లో ఆందోళన...

Read Also: Suryakumar Yadav: వామ్మో ఇదేం బ్యాటింగ్.. సూర్యకుమార్ యాదవ్ మరో ప్రపంచ రికార్డ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News