కోల్‌కతా: కరోనా ప్రభావంతో(Corona Effect) ఒక్కసారిగా గోవు మూత్రానికి డిమాండ్ ఎక్కువైపోయింది. గో మూత్రం సేవిస్తే, ఆవు పేడ శరీరానికి పూసుకుంటే కరోనా వైరస్ సోకదని మూఢనమ్మకాలు సృష్టించడంతో గో మూత్రం, ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. (West Bengal)పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతాకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాల వ్యాపారి జాతీయ రహదారిపై లీటర్ గోమూత్రాన్ని రూ.500, ఆవు పేడను రూ.500 కిలో అమ్ముడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ప్రధాని మోదీ ఈ విపత్తును కనిపెట్టలేకపోతున్నారా..
గో మూత్రం సేవిస్తే కరోనా వైరస్ మాయమవుతుందని చెప్పడంతో గో మూత్రాన్ని, పేడను అమ్ముతున్నానని మబూద్ అలీ తెలిపాడు. తనకు రెండు ఆవులు ఉన్నాయని, ఒకటి దేశీయ ఆవు, మరొకటి జెర్సీ ఆవు ఉందని, తాను సాధారణంగా రోజు పాలు అమ్మి జీవనం సాగిస్తానని, గో మూత్రం, పేడ ఉపయోగాలు తెలుసుకొని, వాటిని అమ్ముతున్నానని అలీ తెలిపాడు. ఆవు మూత్రం లీటర్, కిలో పేడ 300 రూపాయలు పెట్టి కొంటున్నారని, దేశీయ ఆవు మూత్రానికి ప్రజలు బాగా ఎగబడుతున్నారని అన్నారు.
Read Also: కింగ్ కోబ్రానే మట్టికరిపించిన ముంగూస్ వీడియో వైరల్...
మరోవైపు ఇదే అంశంపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. ఆవు మూత్రం, పేడతో కరోనా వైరస్ ను నివారించలేమని, కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు ఆవు పేడ, మూత్రాన్ని ఎవరు సేవించొద్దని వైద్యులు సూచించారు. కరోనా వైరస్‌తో భారత్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా 126 మందికి పాజిటివ్ అని తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 7 వేలకు పైగా మంది మరణించగా, ఒక లక్ష ఎనభై వేలకు పైగా మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని డబ్ల్యుహెచ్ఒ అధికారికంగా వెల్లడించింది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..