Burra Venkatesham ias appointed as tgpsc new chairman: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం టీజీపీఎస్సీలో భారీగా మార్పులు తీసుకొచ్చారని తెలుస్తొంది. ఆయన గతంలో గ్రూప్ ఎగ్జామ్ లు పలు మార్లు వాయిదాలు పడటం, పేపర్ లీకేజీలపై సీరియస్ గా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తొంది. దీంతో అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే.. అప్పటి చైర్మన్ స్థానంలో.. సీనియర్ ఐపీఎస్ మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు.
మహేందర్ రెడ్డి చార్జీ తీసుకున్న తర్వాత.. ఎక్కడ కూడా ఎగ్జామ్ ల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మహేందర్ రెడ్డి.. డిసెంబర్ 3న ముగియనుందని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్.. బుర్రా వెంకటేశం ను టీజీపీఎస్సీ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. ఆయన ఐఏఎస్ కు స్వచ్చంద పదవీ విరమణ చేయనున్నట్లు సమాచారం. 1995 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన బుర్రా వెంకటేశం సర్వీస్ కాలం.. 2028 ఏప్రిల్ 10 వరకు ఉన్నట్లు తెలుస్తొంది.
మరోవైపు మొన్న.. ఐపీఎస్ రిటైర్డ్ అధికారి.. ప్రస్తుతం.. మరల ఐఏఎస్ అధికారికి టీజీపీఎస్సీ బాధ్యతలు అప్పగించడం పట్ల రాజకీయాల్లోను.. సివిల్స్ సర్వీసెస్ అధికారుల్లోను ఈ అంశం చర్చనీయాంశంగా మారిందంట.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామక ఫైల్ మీద.. గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుత టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3న ముగియనుంది.
Read more: Telangana Govt 10Th Class: 10 క్లాస్ మార్కులపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్..
బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్ గా దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. జనగామ జిల్లాకు చెందిన బుర్రా వెంకటేశం ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో.. బుర్రా వెంకటేశంను నూతన ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter