BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ 17 మంది అభ్యర్ధుల జాబితా

BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. తాజాగా బీఆర్ఎస్ కూడా మొత్తం 17 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి కూడా బీఆర్ఎస్ పోటీలో ఉండటం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2024, 03:45 PM IST
BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ 17 మంది అభ్యర్ధుల జాబితా

BRS Loksabha List: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే అన్ని విధాలా సరైన అభ్యర్దుల్ని ఎంపిక చేసేందుకు మల్లగుల్లాలు పడింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచితూచి అడుగేసినట్టు అర్ధమౌతోంది. 

తెలంగాణలో హైదరాబాద్ సహా మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అభ్యర్ధుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా కేసీఆర్ ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నారని పార్టీ వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పుుడు పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమైందని, ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్ధులకు ప్రజల్నించి అనూహ్య స్పందన లభిస్తోందని బీఆర్ఎస్ వెల్లడించింది. 

1. హైదరాబాద్-గెడ్డం శ్రీనినాస యాదవ్ బీసీ
2. సికింద్రాబాద్-పద్మారావు గౌడ్ బీసీ
3. ఖమ్మం- నామా నాగేశ్వరరావు ఓసీ
4. మహబూబాబాద్- మాలోత్ కవిత ఎస్టీ
5. కరీంనగర్-బోయినపల్లి వినోద్ కుమార్ ఓసీ
6. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ బీసీ
7. పెద్దపల్లి-కొప్పుల ఈశ్వర్ ఎస్ సి
8. మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డి ఓసీ
9. వరంగల్- డాక్టర్ కడియం కావ్య ఎస్ సి
10. జహీరాబాద్-గాలి అనిల్ కుమార్ బీసీ
11. నిజామాబాద్-బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీసీ
12. అదిలాబాద్-ఆత్రం సక్కు ఎస్టీ
13. మల్కాజ్ గిరి- రాగిడి లక్ష్మారెడ్డి ఓసీ
14. మెదక్ -పి వెంకట్రామి రెడ్డి ఓసీ
15. నాగర్ కర్నూలు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ
16. భువనగరి-క్యామ మల్లేశ్, బీసీ
17. నల్గొండ-కంచర్ల కృష్ణారెడ్డి ఓసీ

Also read: Fastag kyc: ఫాస్టాగ్ కేవైసీ చేయించారా, మరో వారం రోజులే గడువు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News