KCR On CM Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై మాట్లాడిన కేసీఆర్.. తమకున్న సమాచారం ప్రకారం ఏపీలో మారోసారి జగన్ ప్రభుత్వమే రాబోతుందన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. వాస్తవానికి అక్కడ ఏం జరిగినా తమకు పట్టింపులేదన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వాళ్లు గెలుస్తారని అన్నారు. అయితే తమకు వస్తున్న సమాచారం అయితే జగన్ మళ్లీ గెలుస్తారని వస్తోందన్నారు. రాజకీయ నాయకుడిగా ఈ సందర్బంలో తాను చెప్పడం.. ఎవరికో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు. వాళ్ల రాష్ట్రం, వాళ్ల రాజకీయం ఏదో చేసుకుంటున్నారని.. తమకు అందే సమాచారం మేరకు అయితే జగన్ గెలుస్తున్నారని చెబుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీపై కూడా కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేదని.. అసలు అది స్కామ్ కాదని నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమ్ అని అన్నారు. మద్యం పాలసీ ఢిల్లీ ప్రభుత్వానిదని.. అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు పాలసీ ఉంటుందన్నారు. ఇది ఎలా స్కామ్ అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు. ఈ కేసుతో ఎలాంటి సబంధం లేకున్నా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదన్నారు. ఢిల్లీ సీఎంను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని.. బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇంతకుఇంత మోదీ అనుభవిస్తాడని కామెంట్స్ చేశారు.
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 8 నుంచి 12 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. సికింద్రాబాద్‌లో తమ గెలుపు కన్ఫార్మ్ అయిపోయిందని.. కిషన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. అక్కడ తమ అభ్యర్థి పద్మారావు ఎంతో సౌమ్యుడు అని.. ఆయన గెలుపు తథ్యమన్నారు. బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్‌గా మార్పు అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. టీఆర్‌ఎస్‌గా మార్చే ఆలోచన లేదన్నారు.
అది సాధ్యం కాదని.. ఎన్నికల కమిషన్ వద్ద ఒక పార్టీ పేరు రద్దు అయిన తర్వాత ఐదేండ్ల వరకు దానిని ఫ్రీజింగ్ చేస్తుందన్నారు కేసీఆర్. మళ్లీ పార్టీ పేరును మార్చే ఆలోచనే లేదన్నారు. 18 రోజుల్లోనే రూ.700 కోట్ల బీర్లు తాగేశారని ఇటీవల వార్తలు వచ్చాయని.. అదే తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను తాగుబోతులను చేస్తున్నారని కొన్ని పత్రికలు విషం చిమ్మాయని అన్నారు. ఇప్పుడు బీర్ల అమ్మకాలు పెరిగితే.. ఎండల కారణంగా ప్రజలు తాగుతున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి