Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 3, 2024, 05:48 PM IST
Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

Khammam Floods: భారీ వర్షాలతో వరద ముంచెత్తడంతో ఖమ్మం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుంది. వరదలో ఇబ్బందులు పడుతున్న బాధితులను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. జరిగిన నష్టం.. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని బాధితులు వాపోవడంతో వారికి అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సహాయం చేసే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌

ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ముంపు ప్రజలను అప్రమత్తం చేసి ఆదుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కనీసం హెలికాప్టర్ పంపించలేని పరిస్థితి అని తెలిపారు. సీఎం వ్యంగ్యంగా మాట్లాడటమే తప్ప పాలనపై పట్టు లేదని ఎద్దేవా చేశారు. మోకాలికి.. తొడకు లింకు పెట్టి సీఎం వ్యంగ్యంగా మాట్లాడతారని చెప్పారు.

Also Read: Telangana Rains: తెలంగాణకు మళ్లీ ముప్పు.. మరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

 

'ఏ ఇంటికి వెళ్లినా రూ.4 లక్షల నుంచి 10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. బంగారం, సర్టిఫికెట్స్ అన్ని పోగొట్టుకుని సర్వం కోల్పోయారు' అని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 'వరదల్లో చిక్కుకున్న వారికి తాగునీరు అందించలేక పోయారు' అని తెలిపారు. 'సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు' అని ప్రశ్నించారు. 

వరద బాధితులకు రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో పువ్వాడ, సండ్ర ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తుచేశారు. విద్యుత్ ను పునరుద్ధరణ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైఫల్యమైందని విమర్శించారు. ఖమ్మం, మహబూబాద్ జిల్లా ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. 'వరదల్లో 28 మంది మృతి చెందారు. ఆ సంఖ్యను కూడా దాచిపెట్టే ప్రయత్నం చేయడం బాధాకరం. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 9 మంది చనిపోయారు. మా దగ్గర పక్కా లెక్క ఉంది' అని ప్రకటించారు.

'పాలమూరు ప్రాజెక్ట్ మునిగిపోయింది. సాగర్ కాలువ తెగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యం. రెండు చోట్ల కాలువ తెగిపోయింది. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల నష్టం వాటిల్లింది' అని హరీశ్‌ రావు వెల్లడించారు. నష్టపోయిన రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి' అని డిమాండ్‌ చేశారు. 'అధికారంలో ఉండి.. ప్రతిపక్షలో ఉండి మమ్మల్ని రేవంత్‌ విమర్శించారు. అన్నీ మేమే చేస్తే మీరెందుదు' అని ప్రశ్నించారు. ' ఇంకా మీరు అధికారంలో ఉండి ఏం లాభం' అని నిలదీశారు.

'వర్షం వచ్చిన సమయంలో సీఎం ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు రివ్యూ తక్కువ ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలకు సేవ చేసే పని చేయాలి' అని రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు హితవు పలికారు. ఇక తమపై జరిగిన దాడిపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. 'పరామర్శకు వస్తే మాపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తారా? అజయ్ కుమార్ కారుపై దాడి చేయడం ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. 'తెలంగాణ ఉద్యమంలో నేతల్లో జేజమ్మనే ఎదిరించి వచ్చిన వాళ్లం నువ్వెంత' అని ధ్వజమెత్తారు.

'మృతులకు రూ.25 లక్షలు, ఎకరానికి రూ.30 వేలు, ఇసుక మేట వాళ్లకు రూ.50 వేలు.. సర్టిఫికెట్స్ పోగొట్టుకున్న వాళ్లకు ఉచితంగా ధ్రువపత్రాలు ఇప్పించండి. 3 వేల ఇళ్ల నిర్వాసితులు కట్టుబట్టలతో బయటకొచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.2 లక్షలు ఇవ్వాలి' అని హరీశ్ రావు బాధితుల తరఫున డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News