Revanth Reddy: కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకో..: రేవంత్ రెడ్డి కౌంటర్

BRS MLC Kasireddy Joined in Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరుకున్నారు. మరుగుజ్జులు ఎవరో.. ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో  తేలుతుందన్నారు రేవంత్ రెడ్డి.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 6, 2023, 06:44 PM IST
Revanth Reddy: కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకో..: రేవంత్ రెడ్డి కౌంటర్

BRS MLC Kasireddy Joined in Congress: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే అనే విషయం ప్రజలకు అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ బంధం బలంగా ఉంది కాబట్టే బీఆర్ఎస్ చేస్తున్న అవినీతికి బీజేపీ రక్షణకవచంగా నిలుస్తుందని విమర్శించారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. 

"వంశీ చంద్ రెడ్డి తాను పోటీ చేసే స్థానంలోకి నారాయణ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా. తెలంగాణలో మిగతా నాయకులు వంశీచంద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలి. మా దగ్గర ప్రభుత్వం లేదు. పదవులు లేవు. అయినా సరే.. కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ పదవుల్లో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. మరుగుజ్జులు ఎవరో.. ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో  తేలుతుంది. ఓడిపోతే పారి పోదామని ఇతర దేశాల పాస్ పోర్ట్ లు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామన్నారు. మమ్మల్ని మరుగుజ్జులు అంటారా.. కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకోవాలి.

కేసీఆర్‌కు ముఖం చెల్లక బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసింది. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్‌ను అడిగితే చెబుతారు. మీరు అనుభవిస్తున్న పదవులు, హోదా కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి. ఆరోగ్య శ్రీ, రైతు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్ వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ  అమలు చేసింది. ఉచిత కరెంట్ హామీని రాజశేఖర రెడ్డి అమలు చేసి చూపించారు.

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో చేస్తున్న అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయడం లేదు.. ఎందుకు మిగతా నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారు. తెలంగాణలోనే సమాన అభివృద్ధి చేయని మీరు కాంగ్రెస్ ను విమర్శిస్తారా..? ఛత్తీస్‌ఘడ్‌లో, హిమాచల్‌లో అమలు చేస్తున్న పథకాలు మీ దగ్గర ఉన్నాయా..? బీఆర్‌ఎస్ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు,సీట్లు.. కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం.. ప్రజలకు ఏం చేస్తామో మేం చెప్పాం. బీజేపీకి అభ్యర్థులు లేరు. మానిఫెస్టో లేదు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ అధికారంలో లేదు. తెలంగాణ వచ్చాక రెండు సార్లు అధికారంలో ఉన్నది మీరే. ఉమ్మడి రాష్ట్రంలో మా పదేళ్ల పాలన.. తెలంగాణలో మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..?" అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.

Also Read: RBI Monetary Policy: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. స్థిరంగా రెపో రేటు   

Also Read: Shikhar Dhawan Divorce Reason: మాజీ భార్య కారణంగా భారీగా నష్టపోయిన శిఖర్ ధావన్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News