KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..

KCR Reacts About Leaders Arrest: దేశంలో జరుగుతున్న వరుస అరెస్ట్‌లపై తొలిసారి మాజీ సీఎం కేసీఆర్‌ నోరు మెదిపారు. తన కుమార్తె కవితతోపాటు హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌పై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 22, 2024, 09:00 PM IST
KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..

KCR Kavitha: మద్యం కుంభకోణంలో తన కుమార్తె అరెస్ట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తొలిసారి స్పందించారు. అరెస్టయినప్పటి నుంచి కేసీఆర్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తుండగా సమాధానం ఇవ్వని గులాబీ దళపతి తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ అరెస్ట్‌ నేపథ్యంలో స్పందించారు. దేశంలో కీలక నాయకులు వరుసగా అరెస్టవుతుండడంతో కేసీఆర్‌ స్పందించారు. కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Telangana: ఆనాడే అత్యంత ధనిక సీఎం కేసీఆర్‌.. ఆయనకు హెలికాప్టర్‌ ఎక్కడిది?

 

అరెస్టులతో ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్‌లుగా వర్ణించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందని విమర్శించారు. అరెస్ట్‌ చేసిన వారిని వదిలిపెట్టాలని కోరారు.

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

'అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు. ప్ర‌తిప‌క్షాలను నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మోదీ ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటోం‌ది. ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైనది. అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని అరెస్టయిన వారిని విడుదల చేయాలి' అని కేసీఆర్‌ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News