YSRTP vs Congress: కాంగ్రెస్‌లో విలీనానికి తెర, ఇక ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల బరిలో

YSRTP vs Congress: వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి బ్రేక్ పడింది. అంతా అయిపోయింది, విలీనమే తరువాయి అంటూ జరిగిన ప్రచారం నిలిచిపోయింది. తెలంగాణ బరిలో ఒంటిరిపోరుకు షర్మిల సిద్ధమైంది. 

Edited by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2023, 12:41 PM IST
YSRTP vs Congress: కాంగ్రెస్‌లో విలీనానికి తెర, ఇక ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల బరిలో

YSRTP vs Congress: దాదాపు 4-5 నెలలుగా ఊరిస్తున్న అంశానికి తెరపడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల పార్టీ విలీనం అంశం ఇక లేనట్టేనని సమాచారం. షర్మిల విధించిన డెడ్‌లైన్ ముగిసినా కాంగ్రెస్ స్పందించకపోవడంతో ఒంటరిగానే బరిలో దిగాలని షర్మిల నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 

వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ఉన్నారు. పాదయాత్ర చేస్తూ జనంలో ఆదరణ పెంచుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తరువాత ఆ ప్రభావం తెలంగాణపై పడింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి చర్చలు కూడా కాంగ్రెస్ అధిష్టానంతో జరిగాయి. అయితే తెలంగాణ నేతలు విలీనానికి అడ్డుపడటంతో డీకే శివకుమార్ మరోసారి రంగంలో దిగి..రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీలను కలిశారు. ఇక అంతా సమసిపోయింది రేపో మాపో విలీనం మిగిలిందనుకున్నారు. ఆ తరువాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకు సెప్టెంబర్ 30 వరకూ డెడ్‌లైన్ విధించారు. 

ఇప్పుడా డెడ్‌లైన్ కూడా ముగియడంతో ఇక విలీనం అంశానికి తెర దించేశారు షర్మిల. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగేందుకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి వైఎస్ షర్మిల రాక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చివరికి షర్మిల కూడా విసుగుచెంది విలీనానికి బ్రేక్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 

Also read: Breakfast Scheme In Telangana: సికింద్రాబాద్‌లో అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్‌.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News