CM KCR: మోడీ, షా దెబ్బకు టీఆర్ఎస్ షేక్.. ఈటలతో టచ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

CM KCR: కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jul 5, 2022, 10:51 AM IST
  • కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ యాక్షన్ ప్లాన్
  • చేరికల కమిటి చైర్మెన్ గా ఈటల రాజేందర్
  • ఈటల ఆపరేషన్ తో గులాబీ పార్టీలో గుబులు
CM KCR: మోడీ, షా దెబ్బకు టీఆర్ఎస్ షేక్.. ఈటలతో టచ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

CM KCR: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు గ్రాండ్ గా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది తెలంగాణ బీజేపీ. సభకు జనం పోటెత్తడంతో బండి సంజయ్ టీమ్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.అయితే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగమే పెద్ద చర్చగా మారింది. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తారని కమలనాధులు ఆశించారు. కాని ప్రధాని మోడీ తన ప్రసంగంలో కేసీఆర్, టీఆర్ఎస్ పేరే ఎత్తలేదు. మోడీ ఎందుకు కేసీఆర్ ను టార్గెట్ చేయలేదన్నది ప్రశ్నగా మిగిలింది. అయితే పరేడ్ గ్రౌండ్ సభలో మోడీ ప్రసంగం వెనుక బీజేపీ వ్యూహం ఉందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందుకే బహిరంగ సభలో కేసీఆర్ పేరు ఎత్తకుండా మోడీ మాట్లాడారని తెలుస్తోంది.

సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ఈటలకు ఊహించని ప్రాధాన్యత ఇచ్చారు బీజేపీ అగ్ర నేతలు. తెలంగాణ రాజకీయలపై మాట్లాడే అవకాశం కల్పించారు. దాదాపు 15 నిమిషాల పాటు ప్రసంగించిన ఈటలను మోడీ, జేపీ నడ్డా అభినందించారు. కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఈటలకు.. గులాబీ పార్టీ లోని  వీక్ నెస్ లు అన్ని తెలుసు. అందుకే ఈటల ద్వారా కేసీఆర్ కు చుక్కలు చూపించేందుకు బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ పై తమ తురుపుముక్కగా భావిస్తున్న రాజేందర్ ను జాతీయ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే రంగంలోకి దింపిందని అంటున్నారు.

తనపై కేసీఆర్ కక్ష పూరితంగా వ్యవహరించారనే కోపంతో ఉన్న ఈటల రాజేందర్ .. రివేంజ్ కోసం ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి షాక్ ఇచ్చినా.. మరింతగా ప్రతీకారం తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. బీజేపీ హైకమాండ్ పూర్తి ఆశిస్సులు ఉండటంతో.. గులాబీ బాస్ కు చెమటలు పట్టించేందుకు ఈటల సిద్ధమయ్యారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో సుదీర్గ కాలం పనిచేసిన ఈటలకు... ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని జిల్లా నేతలతో పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులంతా ఈటలతో టచ్ లోనే ఉన్నారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి.. అందరిని కమలం పార్టీ గూటికి చేర్చేలా ఈటల ప్రయత్నిస్తున్నారు. ఈటల పార్టీ మారినా.. చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఆయనతో సన్నిహితింగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈటలకే చేరికల బాధ్యతలు అప్పగించడంతో.. వాళ్లందరికి కాషాయ కండువా కప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈటలకు మొదటి నుంచి అనుచరుడిగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సీనియర్ ఎమ్మెల్యే త్వరలోనే కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు. వరంగల్ జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు ఈసారి టీఆర్ఎస్ టికెట్ కష్టమనే ప్రచారం సాగుతోంది. ఈటలతో సంబంధాలు ఉండటం వల్లే కేసీఆర్ వాళ్లను దూరం పెట్టారని అంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా కాషాయ గూటికి చేరుతారని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు కూడా రాజేందర్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కూడా త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. నిజామాబాదా్, ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమ కారులు, టీఆర్ఎస్ లో తమకు గుర్తింపు లేదని భావిస్తున్న నేతలు రాజేందర్ ను కలిసి వెళుతున్నారని తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలంతా రాజేందర్ తో మాట్లాడుతున్నారని.. వాళ్లందరికిన సమయం చూసుకుని బీజేపీ గూటికి చేర్చే ప్రయత్నాల్లో  మాజీ మంత్రి ఉన్నారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ లీడర్లు కూడా త్వరలోనే కమలం గూటికి చేరుతారని అంటున్నారు. ఇందులో గతంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్లు, టికెట్ ఆశించి భంగపడిన వాళ్లు ఉన్నారని తెలుస్తోంది.మొత్తంగా తనను అవమానించిన కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని ఈటల డిసైడ్ అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈటలను చేరికల కమిటీ చైర్మెన్ గా నియమించడంతో టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో కలవరం నెలకొందని తెలుస్తోంది. అందుకే ఈటలతో సంబంధాలు ఉన్న నేతలతో కేటీఆర్ మాట్లాడి పార్టీ మారకుండా తాయిలాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 

Read also: Rains in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు...  

Read also: Covid Cases: నిన్నటి కంటే భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News