Arvind On CM KCR: 'పాస్​పోర్టులు అమ్ముకున్న దొంగ' అంటూ సీఎం కేసీఆర్​పై విమర్శలు..!

Arvind On CM KCR: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​.. సీఎం కేసీఆర్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాస్ట్​పోర్టులు అమ్ముకున్న దొంగ అంటూ ఆరోపణలు చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 03:30 PM IST
  • సీఎం కేసీఆర్​పై ఎంపీ అర్వింద్​ తీవ్ర విమర్శలు
  • పరుష పదజాలంతో ఆరోపణలు
  • నిన్న తనపై దాడి జరిగిన తీరుపై ప్రెస్​మీట్​
Arvind On CM KCR: 'పాస్​పోర్టులు అమ్ముకున్న దొంగ' అంటూ సీఎం కేసీఆర్​పై విమర్శలు..!

Arvind On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​​ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. నిన్న తన కారుపై జరిగిన దాడి గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంపీ అర్వింద్​. ఇందులో సీఎం కేసీఆర్ సహా.. ఆయన కుటుంబంలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్న వారిపైనా ధ్వజమెత్తారు.

ఇలాంటి సీఎం, వారి కుటుంబ సభ్యులపై ఐఏఎస్​, ఐపీఎస్​లు ఆధారపడితే వ్యవస్థ ఇలానే ఉంటుందని తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ విమర్శలు చేశారు.

కేసీఆర్​పై తీవ్ర వ్యాఖ్యలు..

'పాస్​పోర్ట్​లు అమ్ముకున్న దొంగ, లారీలు ఆపి పైసలు వసూలు చేసిన.. వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక టైంలో మంచి పేరు తెచ్చుకున్న మహేందర్​ రెడ్డి లాంటి వారు కూడా ఇలానే తయారవుతారు' అని అర్వింద్​ ఆరోపణలు చేశారు.

దాడి గురించి వివరాలు..

అయితే తాను నిన్న ఉదయం నందిపేట్​ పేట్​ ప్రొగ్రామ్​కు హాజరవ్వాల్సి ఉందని చెప్పారు అర్వింద్​​. అర్మూరు నుంచి వచ్చిన టీఆర్​ఎస్ నాయకుకులు ఆలూరు సమీపంలో పెద్ద ఎత్తున గుమి గూడారని.. వారికి తోడు 25 మంది వరకు హైదరాబాద్​ నుంచి వచ్చారని ఆరోపించారు. దాడి ప్రణాళిక వారిదేనన్నారు.

వారి కార్ల నుంచే రాడ్లు, గడ్డపారలు, కత్తి తీసి.. తమ కార్లపై దాడి చేశారన్నారు. కొంత మంది తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తమ కార్యకర్తలు ఫోన్​ చేసి చెప్పారని వివరించారు.

ఈ విషయంపై కమిషనర్​తో​ మాట్లాడితే.. వాళ్లను క్లియర్​ చేసి ప్రొటెక్షన్​ ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందుకే ఆర్మూర్​ పట్టణం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేసినట్లు వెల్లడించారు.

అయితే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారే తప్ప.. తనకు సెక్యూరిటీ పెంచపడం గానీ.. తనపై దాడి చేసేందుకు ప్లాన్​ చేస్తున్న వారిని క్లియర్ చేయలేకపోయారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్​కు కూడా ఈ విషయం చెప్పినట్లు తెలిపారు.

ఇక కార్యకర్తలు వెళ్దామని చెప్పడం, తనతో ఉన్న ఓ సీఐ కూడా క్లియర్ చేస్తున్నామనడంతో అక్కడి నుంచి బయల్దేరామన్నారు. అయితే ఇస్సాపల్లి గ్రామం చేరుకునే సమయానికి గొడవలు మరింత పెద్దగయ్యే అవకాశముందని ఫోన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దీనితో తాము అక్కడే ఆగిపోయామని.. టీఆర్​ఎస్​ కార్యకర్తలే అక్కడకు చేరి దాడి చేసినట్లు వివరించారు. దాడి జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా తన కారు వద్ద లేరని ఆరోపించారు.

Also read: TRS District Presidents: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే..

Also read: Republic Day 2022: ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News