Abhishek Manu Singhvi: రాజ్యసభకు ఏర్పడిన ఉప ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో ఏర్పడిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వారు తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామాలు చేశారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు సమర్పించగా 12 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Also Read: Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలు
కేకేకు నిరాశ!
రాజ్యసభ ఉప ఎన్నికలో తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కే కేశవరావు రాజీనామా చేసిన స్థానానికి అభిషేక్ సింఘ్వీకి అవకాశం ఇచ్వ్వచింది. మరోసారి రాజ్యసభ అవకాశం దక్కుతుందని భావించి రాజీనామా చేసిన కేకేకు భారీ షాక్ తగిలింది. రాజ్యసభ అవకాశం లభించకపోవడంతో కేకే నిరాశకు లోనయినట్లు తెలుస్తోంది.
Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌లోకి వెళ్లాక ఫాపం పోచారం పరిస్థితి.. పార్టీ శ్రేణులతో కేటీఆర్ విచారం
రాజీనామా చేసిన వారు వీరే!
పీయూష్ గోయల్ (బీజేపీ)
సర్బానంద సోనోవాల్ (బీజేపీ)
జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ)
కామఖ్య ప్రసాద్ తస (బీజేపీ)
వివేక్ ఠాకూర్ (బీజేపీ)
వివేక్ ఠాకూర్ (బీజేపీ)
బిప్లబ్ కుమార్ దేబ్ (బీజేపీ)
ఉదయన్ రాజే భోస్లే (బీజేపీ)
మీసా భారతి (ఆర్జేడీ)
కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్)
దీపేంద్ర సింగ్ హుడా (కాంగ్రెస్)
కే కేశవ రావు (బీఆర్ఎస్ పార్టీ)
తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం?
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలినట్టయ్యింది. కేకేకు అవకాశం లభిస్తుందని అందరూ భావించగా ఊహించని రీతిలో అభిషేక్ సింఘ్వీకి అవకాశం లభించడంతో స్థానిక పార్టీ నాయకత్వం విస్తుపోయింది. అభిషేక్ సింఘ్వీకి అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులకు అవకాశం ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వడం పార్టీలో దుమారం రేపినట్లు సమాచారం. అయితే అభిషేక్‌కు అవకాశం ఇస్తున్న విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలియదని తెలుస్తోంది. ఈ ప్రకటన వెలువడిన సమయంలో రేవంత్ కాగ్నిజెంట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన విడుదలతో హడావుడిగా ప్రసంగం చేసి వెళ్లిపోయారని చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై తన సన్నిహితులతో రేవంత్ చర్చ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter