Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌కు దిగ్గజ సంస్థతో వెయ్యి ఉద్యోగాలు

Amber Resojet Invests Rs 250 Cr In Telangana: కొన్నాళ్లు తెలంగాణకు ఆగిపోయిన పెట్టుబడుల ప్రవాహంలో మళ్లీ కదలిక వచ్చింది. చాన్నాళ్ల తర్వాత తెలంగాణకు భారీ పెట్టుబడి లభించింది. పెట్టుబడితోపాటు వెయ్యి ఉద్యోగాలు లభించనుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 25, 2024, 10:59 PM IST
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌కు దిగ్గజ సంస్థతో వెయ్యి ఉద్యోగాలు

Amber Resojet Invests: తెలంగాణకు చాలా కాలం తర్వాత మరో పెట్టుబడి లభించింది. ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఓ దిగ్గజ సంస్థ ముందుకు వచ్చింది. ఆ పెట్టుబడితో స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రకటించారు. పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే అంబర్ – రెసోజెట్ భాగస్వామ్య సంస్థ తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు.

ఇది చదవండి: Shailaja Died: విద్యార్థి శైలజ మృతి.. ఎంతమంది చస్తే రేవంత్‌ రెడ్డి నీ గుండెకరుగుతుంది?

న్యూఢిల్లీలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అంబర్ – రెసోజెట్ సంస్థ ప్రతినిధులు పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. అంబర్ రెసోజెట్ సంస్థకు ప్రభుత్వపరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్ల లాంటి పలు పరికరాలకు ఉత్పత్తి చేసి అందిస్తోందని వివరించారు.

ఇది చదవండి: KT Rama Rao: పెండ్లికి పోతావో .. సావుకు పోతావో రేవంత్‌ రెడ్డి నీ ఇష్టం

వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. త్వరలోనే అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ)ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. అంబర్ ఎంటర్ ప్రైజెస్ వందేభారత్ రైళ్లు.. మెట్రో రైళ్ల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలతో పాటు, బస్సులు, డిఫెన్స్ వాహనాలు, పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండిషనర్ల తయారీలో పేరు ఉందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News