Traffic Restrictions In Khairtabad: అతిపెద్ద పండుగ వచ్చేసింది. రేపటి నుంచి గణపతి నవరాత్రులు మొదలుకానున్నాయి. రేపు 7వ తేదీ శనివారం వినాయక చవితి ఈ సందర్భంగా రేపటి నుంచి పదిరోజుల పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. గణేష నవరాత్రులు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోనే ఇది అతిపెద్ద ఫెస్టివల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు
రేపటి నుంచి 10 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి పది రోజుల పాటు ఈ ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టానున్నారు. ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనదారులు ముందుగా ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోండి.
ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా రేపు స్కూళ్లు, కళాశాలలకు ప్రభుత్వం బంద్ ప్రకటించింది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి కూడా భక్తులు పది రోజులపాటు వస్తారు. ఈ ప్రాంతంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు.
వీవీ విగ్రహం నుంచి మింట్ కంపౌండ్ వయా రాజీవ్ గాంధీ విగ్రహం గుండా వెళ్లే వాహనాలు రాజీవ్ గాంధీ నుంచి నిరంకరీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు.ఇక సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి బడా గణేశ్ వయా రాజ్‌దూత్ గల్లీ గుండా వెళ్లే వాహనాలకు రాజ్‌దూత్ గల్లీ వద్ద నుంచి ఇక్బాల్ మినార్‌కు మళ్లించనున్నారు.
Read more: Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..
ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కంపౌండ్ వెళ్లే వాహనాలను మింట్ లేన్ ప్రధాన మార్గం నుంచి తెలుగు తల్లి ఫైఓవర్‌కు మళ్లిస్తున్నరు. ఇక ఎన్టీఆర్ మార్గ్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి మింట్ కంపౌండ్ వెళ్లేవారిని నెక్లేస్ రోడ్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫైఓవర్‌కు మళ్లిస్తున్నారు.
నిరంకారీ వయా ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేన్ నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్‌కు వెళ్లే వాహనాలను మళ్లించి పోస్టాఫీస్ గుండా సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ జంక్షన్ కు మళ్లిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ లో ఎక్కువ భక్తులు ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి షాదన్ కాలేజ్, నిరంకారీ, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, మింట్ కంపౌండ్, నెక్లేస్ రోడ్ రోటరీ మార్గాల్లో వాహనచోదకులు వెళ్లకపోవడమే మేలు.
నెక్లేస్ రోటరీ,ఎన్టీఆర్ గార్డెన్‌గుండా ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకునే వారు తమ వాహనాలను ఐమ్యాక్స్ థియేటర్ పక్కన అంబేడ్కర్ స్కేర్ పార్కింగ్, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ఏరియా, ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా, సరస్వతి విద్యా మందీర్ హైస్కూల్ ప్రాంగణ, రేస్ కోర్స్ రోడ్డు వద్ద పార్కింగ్ పెట్టుకోవచ్చు.
Read more: SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల.. 39,481 పోస్టుల భర్తీకి కేవలం 10 పాసైతే చాలు..
ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నెక్లేస్ రోడ్డు, ఐమ్యాక్స్ రోటరీ, ఖైరతాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహం రాజ్‌దూత్ లేన్ రోడ్డు గుండా చేరుకోవాలి. భక్తులు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ట్రాఫిక్ పోలీసుల హెల్పలైన్ నంబర్ 9010203626 సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.