Bhatti vikramarka Corona: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ మహ్మమారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కకు (Bhatti vikramarka) కొవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో... ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని... కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఇవాళ తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తెలంగాణలో కొత్తగా 2,047 కరోనా పాజిటివ్ కేసులు (Corona Cases in Telangana) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. వైరస్ తో ముగ్గురు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1174 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కొవిడ్ టీకాల (Vacciantion) పంపిణీ చేశారు.
Also Read: Pocharam Srinivas reddy: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook