Rajiv Swagruha Flats: లాటరీ పద్ధతిలో బండ్లగూడ, పోచారం ఫ్లాట్ల కేటాయింపులు

Rajiv Swagruha Flats: త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్, టూ బెడ్ రూమ్స్ ఫ్లాట్స్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్.. ఇలా అన్ని కేటగిరీల వారిగా రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ టోకెన్ అడ్వాన్స్ వివరాలను సైతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 07:16 PM IST
Rajiv Swagruha Flats: లాటరీ పద్ధతిలో బండ్లగూడ, పోచారం ఫ్లాట్ల కేటాయింపులు

Rajiv Swagruha Flats: హైదరాబాద్ : రాజీవ్ స్వగృహలో ఇంటిని సొంతం చేసుకుని హైదరాబాద్ లో సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. రాజీవ్ స్వగృహ కార్పోరేషన్‌కు సంబంధించి నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్కేసర్ సమీపంలోని పోచారం ప్రాంతాల్లో గతంలో కేటాయింపులు జరపగా మిగిలిపోయిన త్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్ (2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ (1BHK- Sr Citizen) ఫ్లాట్ల కేటాయింపుల కోసం రేపు మార్చి 3వ తేదీన లాటరీ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు స్పష్టంచేశారు.

త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్, టూ బెడ్ రూమ్స్ ఫ్లాట్స్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్.. ఇలా అన్ని కేటగిరీల వారిగా టోకెన్ అడ్వాన్స్ వివరాలను సైతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు ప్రకటించారు. త్రిపుల్ బెడ్ రూమ్, హాల్, కిచెన్ కలిగిన ఫ్లాట్ కోసం 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్ కింద రూ.3 లక్షలు,  టూ బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఫ్లాట్ కోసం రూ.2 లక్షలు, 1 బెడ్ రూమ్, హాల్, కిచెన్ కోసం రూ.1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు చెల్లించిన వారిని లాటరీకి అర్హులుగా నిర్ణయిస్తారు.                     

మార్చి 3వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి జరిగే లాటరీ ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కేటాయింపులు జరిపేలా దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా యూట్యూబ్,  ఫేస్‌బుక్‌ల ద్వారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ లాటరీ ప్రక్రియను ప్రత్యక్షప్రసారంలో వీక్షించేందుకు పై లింక్స్ అనుసరించవచ్చు.

 https://www.youtube.com/@ACEMedialive
 https://www.facebook.com/AceMediaLive
 https://youtube.com/@IPRTelanganaGovt

Trending News